ఓకే బంగారం రొమాన్స్ ఈజ్ బ్యాక్

Update: 2016-07-14 11:30 GMT
ప్రేమకథలకు మంచి జంట దొరకడం కీలకం. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ సరిగ్గా పండితే దర్శకుడి పని సగం అయిపోతుంది. దుల్కర్ సల్మాన్-నిత్యా మీనన్ జంట అలాంటిదే. వెండితెరపై ప్రేమకథల్ని ఆవిష్కరించడంలో కింగ్ అయిన మణిరత్నం ఏరికోరి వీళ్లిద్దరినీ తన ‘ఓకే బంగారం’ సినిమాకు హీరో హీరోయిన్లుగా ఎంచుకున్నాడంటేనే.. వారి ప్రతిభేంటో అర్థం చేసుకోవచ్చు. వీళ్లిద్దరి మీద మణిరత్నం పెట్టుకున్న నమ్మకం వమ్ముకాలేదు. అద్భుతమైన కెమిస్ట్రీతో.. చక్కటి నటనతో ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందీ జంట. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఆ సినిమానే ‘100 డేస్ ఆఫ్ లవ్’.

ఇప్పటికే మలయాళంలో విడుదలై సూపర్ హిట్టయిన సినిమా ఇది. కొంచెం ఆలస్యంగా తెలుగులోకి తెస్తున్నారు. నిన్నే నాని.. నితిన్ ముఖ్య అతిథులుగా ‘100 డేస్ ఆఫ్ లవ్’ ఆడియో రిలీజైంది. దాంతో పాటే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ‘ఓకే బంగారం’ తరహాలోనే ఇది కూడా మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలాగా కనిపిస్తోంది. దుల్కర్.. నితిన్ ఇద్దరూ కూడా అందంగా కనిపిస్తూ తమ అభినయంతో ఆకర్షిస్తున్నారు. విజువల్స్ చూడముచ్చటగా ఉన్నాయి. మ్యూజిక్ కూడా బాగా కుదిరినట్లుంది. ఈ సినిమాలో హీరో ఫ్రెండుగా ఓ లావుపాటి వ్యక్తి కనిపిస్తున్నాడు. అతడి క్యారెక్టర్ ట్రైలర్లోనే భలే ఫన్నీగా అనిపిస్తోంది. ఈ పాత్రకు కృష్ణుడు డబ్బింగ్ చెప్పడం విశేషం. నిత్య తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంది. దుల్కర్ కు తమిళ అనువాదాలకు వాయిస్ ఇచ్చే ఓ డబ్బింగ్ ఆర్టిస్టుతో డబ్బింగ్ చెప్పించారు. జీనస్ మహ్మద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెలాఖర్లోనే ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.
Full View

Tags:    

Similar News