సీనియర్ సంచలనం మ్యూజికల్ నైట్ షో
వినసోంపైన బాణీలు.. మెలోడీ పాటలతో ఎన్నో వండర్స్ క్రియేట్ చేసారు.
ప్రముఖ సంగీత దర్శకుడు 'దేవా' గురించి పరిచయం అవసరం లేదు. 375కి పైగా చిత్రాలకు సంగీతం అందిం చారు. ఇప్పటికీ ఆయన సేవలు కోలీవుడ్ పరిశ్రమకు అందుతూనే ఉన్నాయి. సంగీత దర్శకుడిగా ఆయనే లెజెండ్. వినసోంపైన బాణీలు.. మెలోడీ పాటలతో ఎన్నో వండర్స్ క్రియేట్ చేసారు. మలయాళం, కన్నడ, తెలుగు చిత్రాలకు ఆయన సంగీతం అందించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'మాస్టర్', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'తొలి ప్రేమ' సినిమాలకు ఆయనే బాణీలు సమకూర్చారు.
ఆ రెండు సినిమాలు మ్యూజికల్ గా ఎంత సంచలనమయ్యాయో తెలిసిందే. ముఖ్యంగా 'తొలిప్రేమ' పాటలు ఇప్పటికీ అద్భుతమే. పవన్ కళ్యాణ్ క్రేజ్ ని పెంచిన పాటలవి. అయితే కొత్తతరం సంగీత దర్శకులు రావడంతో సీనియర్లు అంతా మ్యూజికల్ నైట్స్ వైపు టర్న్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇళయరాజా, రెహమాన్ లాంటి వారు ఇప్పటికే లైవ్ షోలతో శ్రోతల్ని అలరిస్తున్నారు. తాజాగా దేవా కూడా ఈ రంగంలోకి ఎంటర్ అయినట్లు తెలుస్తోంది.
దేవా ఆధ్వర్యంలో జనవరి 18వ తేదీ మదురైలో మ్యూజికల్ నైట్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆ వివరాలు వెల్లడించారు.
ఇప్పటికీ నేను పాడిన 'వారారు వారారు అళగర్ వారారు' పాట వినిపిస్తూనే ఉంటుందన్నారు. ఇప్పటి వరకూ ఎన్నో పాటలు ఆలపించినా వారారు పాట తనకెంతో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చి పెట్టిందన్నారు. 'అందుకు కెప్టెన్ విజయ్ కాంత్ కి ఎప్పటికీ రుణపడే ఉంటాను. ఈ పాటను మొదటలిసారి మధురై గడ్డపై పాడుతున్నాను. ఈ అవకాశం విజయ్ కాంత్ కల్పించార'న్నారు. జనరేషన్లు మారినా ఇళయరాజా, నా సంగీతం చిర స్థాయిగా నిలిచిపోయిం దన్నారు. ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుద్ సంగీతం ఇష్టమన్నారు. అలాగే నటుడిగా అవకాశం వచ్చినా? ఆ ఛాన్స్ వినియోగించుకోలేదన్నారు. కానీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించాలనే ఆశని వ్యక్తం చేసారు.