100 మంది కళాకారులు.. సంవత్సరం శ్రమ

Update: 2018-04-16 14:07 GMT
అలనాటి నటి సావిత్రి మన అందరి మనసులలో చెరగని ఒక ముద్ర వేసుకుంది. ఆమె జీవిత కథను ఆధారంగా తీసుకుని నాగ్ అశ్విన్ మహానటి సినిమా తీస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇందులో కీర్తి సురేష్ సావిత్రి గా మన ముందుకు రాబోతోంది. ఈమధ్యనే విడుదల చేసిన ఫోటోలు చూస్తే ఆమె నిజంగా సావిత్రి నా అన్న సందేహం రానివారుండరు. ఆమె ముఖం మాత్రమే కాక బట్టలు - హెయిర్ స్టైల్ కూడా మాచ్ అవ్వడంతో ఫ్యాన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. అలానే ఆ బట్టల వెనక కూడా ఒక పెద్ద కధ ఉందండోయ్.

గౌరంగ్ షా అనే పేరు మోసిన డిజైనర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. బాలీవుడ్ లో విద్య బాలన్, షర్మిల ఠాగూర్ లాంటి వారికి డిజైన్ చేసిన ఇతను మహానటి సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్నాడు. మహానటి సినిమాలో కీర్తి సురేష్ కు దుస్తులు డిజైన్ చేయడం కోసం ఈయన ఒక సంవత్సరం కసరత్తు చేశారట. ఆరు నెలలకు పైగా సావిత్రి గురించి రీసెర్చ్ కూడా చేశాడట. "షూటింగ్ పూర్తవ్వడానికి సంవత్సరం పట్టింది. షూటింగ్ ఆఖరి రోజు వరకు చాలా కష్టపడ్డాం" అంటూ చెప్పుకొచ్చాడు. ఇలాంటి హై బడ్జెట్ సినిమా చేయడం తన కెరీర్ లోనే మొట్టమొదటిసారి అని ఇలాంటి బయోపిక్ తో ఆరంగేట్రం చేయడం నిజంగా పర్ఫెక్ట్ అని అంటున్న షా " నేను మరియు నా టీం ముందుగా అసలు సావిత్రి ఎక్కువగా వాడిన ఫాబ్రిక్ - లాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్ కూడా మైండ్ లో పెట్టుకుని పనిచేశాం. డైరెక్టర్ అనుకున్నట్టు సావిత్రి మ్యాజిక్ ని మళ్ళీ రి క్రీయేట్ చేయడానికి చాలానే శ్రమ పడ్డాం" అని చెప్పాడు.

ఆ హెవీ ఫాబ్రిక్స్ ను తయారు చేయడానికి 100 కు పైగా కళాకారులు పని చేసేవారట. సావిత్రి దుస్తులన్నీ సింపుల్ గానే కాకా గ్రాండ్ గా కూడా కనిపిస్తాయి అని దానికోసం మరియు ఆ కాలం లో వాడే బట్టలు లాగా డిజైన్ చేయడానికి చాలా బాలన్స్ చేయాల్సి వచ్చిందంట. పలు మ్యూజియంలు కూడా తిరిగి అప్పట్లో వాడిన బట్టలను తన టీం రి క్రీయేట్ చేసిందని అంటున్నాడు డిజైనర్.
Tags:    

Similar News