కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల కారణంగా లేట్ అయిన సినిమాలన్నీ విడుదలకు సిద్ధం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకోవడంతో వారానికో అర డజను చిన్న సినిమాల లెక్కన క్యూ కడుతున్నాయి. ఈ వీకెండ్ లో ఏకంగా తొమ్మిది సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మరికొన్ని చిత్రాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. తాజాగా ''101 జిల్లాల అందగాడు'' చిత్రాన్ని ఆగస్టు 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
టాలెంటెడ్ యాక్టర్ అవసరాల శ్రీనివాస్ - 'చి.ల.సౌ' ఫేమ్ రుహనీ శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం '101 జిల్లాల అందగాడు'. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ అవసరాల స్టోరీ కూడా అందించారు. ఇందులో గొత్తి సూర్య నారాయణ అనే బట్టతల వ్యక్తి పాత్రలో అవసరాల కనిపించనున్నారు. దిల్ రాజు - క్రిష్ జాగర్లమూడి సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ - ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. శిరీష్ - వై. రాజీవ్ రెడ్డి - జె. సాయిబాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
'101 జిల్లాల అందగాడు' చిత్రాన్ని ముందుగా మే 7న విడుదల చేయాలని అనుకున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు ఈ నెల 27న థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆగస్ట్ 27వ తేదీని ఇప్పటికే రెండు సినిమాలు బ్లాక్ చేసుకున్నాయి. సుధీర్ బాబు - 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ''శ్రీదేవి సోడా సెంటర్'' చిత్రాన్ని అదే రోజున రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలానే అక్కినేని హీరో సుశాంత్ నటించిన ''ఇచ్చట వాహనములు నిలుపరాదు'' చిత్రాన్ని కూడా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఈరోజు శుక్రవారం అనౌన్స్ చేశారు.
కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న '101 జిల్లాల అందగాడు' చిత్రం సుధీర్ బాబు - సుశాంత్ సినిమాలతో పోటీ పడనుంది. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత టాలీవుడ్ లో ఇలానే రిలీజ్ డేట్స్ కోసం పోటీ పడ్డారు. ఒకే రోజున నాలుగైదు క్రేజీ మూవీస్ ని బరిలో దింపడం వల్ల ఏ చిత్రానికీ స్పష్టమైన విజయం దక్కకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ ఒకే తేదీకి నాలుగైదు సినిమాలు విడుదల అవుతున్నాయి. ఏమి జరుగుతుందో చూడాలి.