ఏడాదికి వందల కొద్దీ సినిమాలు రిలీజ్ అవుతున్నా సరే అందులో సక్సెస్ అయ్యే సినిమాల సంఖ్య చాలా లిమిటెడ్ అని తెలిసిందే. స్టార్ సినిమాలే కొన్నిసార్లు టార్గెట్ మిస్ అవుతున్నాయి. ఇక లో బడ్జెట్ సినిమాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరైన కంటెంట్ ఉండటమో.. లేక కొత్తగా అనిపిస్తే తప్ప ఆ సినిమాల గురించి ఆడియన్స్ సరిగా పట్టించుకోరు. అయినా సరే ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్ని ఫ్రై డేస్ లానే ఈ శుక్రవారం కూడా కొన్ని సినిమాలు రిలీజ్ ప్లాన్ చేశారు.
డిసెంబర్ 9న ఒకటి రెండు కాదు ఏకంగా 9 సినిమాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు. డిసెంబర్ 2నే హిట్ 2, మట్టి కుస్తీ రిలీజ్ అవగా వారం గ్యాప్ లోనే ఏడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో పంచతంత్రం, రాజయోగం, చెప్పాలని ఉంది, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం, ముఖచిత్రం, ఆక్రోశం సినిమాలు ఉన్నాయి.
వీటిలో సత్యదేవ్, తమన్నా నటించిన గుర్తుందా శీతాకాలం ఒకటే ఆడియన్స్ కు కొద్దిగా పరిచయం ఉన్న సినిమా. అయితే ఆ సినిమాకు కూడా పెద్దగా ప్రమోషన్స్ చేయట్లేదు. తమన్నా అయితే ఈ సినిమా చేసిన విషయాన్ని కూడా మర్చిపోయింది. ఆమె ప్రమోషన్స్ లో పాల్గొంటే పరిస్థితి వేరేలా ఉండేది కానీ తమన్నా లైట్ తీసుకోవడంతో సత్యదేవ్ తోనే ప్రెస్ మీట్ లు చేయిస్తున్నారు చిత్రయూనిట్.
ఇక ఆదిత్ అరుణ్, మేఘా ఆకాష్ జంటగా నటించిన ప్రేమదేశం కూడా సినిమా తీసే టైం లో కొంత హడావిడి చేశారు కానీ రిలీజ్ టైం లో లైట్ తీసుకున్నారు. ఫోటో స్టోరీ తో నేషనల్ అవార్డ్ అందుకున్న సందీప్ రాజ్ డైరెక్షన్ లో వస్తున్న ముఖచిత్రం ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.
మరి సినిమాకు ప్రమోషన్స్ పెద్దగా చేయకపోవడం మైనస్ అని చెప్పొచ్చు. ఇవి చాలదు అన్నట్టు డిసెంబర్ 15న కొరమేను సినిమా రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 16న శాసనసభ, మిరల్ వస్తున్నాయి. వాటితో పాటుగా వరల్డ్ వైడ్ గా అవతార్ 2 ఈ నెల 16నే గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తాకిడితో మిగతా సినిమాలన్నీ కొట్టుకుపోయే ఛాన్స్ ఉంది.
డిసెంబర్ మొదటి రెండు వారాల్లో రిలీజ్ అనుకున్న రెండు పెద్ద సినిమాలు సంక్రాంతికి షిఫ్ట్ అవడంతో డిసెంబర్ రేసులో చిన్న సినిమాలు మాత్రమే వస్తున్నాయి. ఆల్రెడీ ఫస్ట్ వీక్ హిట్ 2 హిట్ అనిపించుకోగా సెకండ్ వీక్ అదే 11న వస్తున్న 7 సినిమాలు నెక్స్ట్ వీక్ అంటే డిసెంబర్ 16న వస్తున్న మూడు సినిమాల్లో ఏది సూపర్ హిట్ కొడుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.