పెరుగుతున్న టెక్నాలజీని ఎక్కువగా సినిమా రంగం వాడేసుకుంటుంది. సినిమాలో టెక్నాలజీతో పాటు విడుదలైన తర్వాత టికెట్ల విషయంలో కూడా కొత్త టెక్నాలజీ విపరీతంగా ఉపయోగపడుతోంది. గతంలో సినిమా చూడాలి అంటే థియేటర్ కు వెళ్లి, అక్కడ క్యూలో నిల్చుని టికెట్లు తీసుకోవాల్సి వచ్చేది. కొత్త సినిమాలకు తోపులాటలు, చొక్కాలు చిరిగేలా క్యూ లైన్ లు ఉండేవి. కాని ఇప్పుడు ఆ పరిస్థితి తక్కువ అని చెప్పాలి. ఆన్ లైన్ బుకింగ్ విధానం వచ్చిన తర్వాత కాస్త ఎక్కువ అయినా పర్వాలేదు, ఇంట్లో ఉండే టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నారు. గత ఏడాది అంటే 2018వ సంవత్సరంలో ఆన్ లైన్ బుకింగ్ బాగా పెరిగిందట.
ఆన్ లైన్ బుకింగ్ పోర్టల్ బుక్ మై షో 2018వ సంవత్సరంలో మొత్తం 1780 సినిమాలకు సంబంధించిన టికెట్లను విక్రయించిందట. అన్ని సినిమాల్లోకెల్లా అత్యధికంగా, అతి స్పీడ్ గా టికెట్లు అమ్ముడు పోయిన సినిమా 2.ఓ గా సదరు సంస్థ ప్రకటించింది. 2.ఓ బుకింగ్స్ ఓపెన్ చేయగానే అన్ని భాషలకు కలిపి సెకనుకు 16 టికెట్ల చొప్పున అమ్ముడు పోయాయి అంటూ సంస్థ పేర్కొంది. సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ ల కాంబో అవ్వడంతో పాటు, సూపర్ హిట్ రోబోకు సీక్వెల్ అవ్వడం వల్ల కూడా 2.ఓ పై అంచనాలు భారీగా పెరిగాయి.
భారీ అంచనాల నడుమ రూపొందిన సినిమా అవ్వడం వల్ల బుకింగ్ ప్రారంభం అయిన వెంటనే సినిమాను చూడాలని ప్రేక్షకులు ఎగబడ్డారు. అలా కేవలం బుక్ మై షో ద్వారానే కోట్లలో టికెట్లు బుక్ అయ్యాయట. ఆ తర్వాత హిందీ సినిమా ‘పద్మావత్’ సినిమా కూడా భారీ ఎత్తున టికెట్లు బుక్ అయ్యాయి. బుక్ మై షోలో 2018లో అత్యధికంగా హిందీ సినిమాలకు టికెట్లు బుక్ అవ్వగా, ఆ తర్వాత స్థానం తెలుగు, మూడవ స్థానంలో ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయి. 2017 తో పోల్చితే 2018లో తమిళ సినిమాల ఆన్ లైన్ బుకింగ్ పెరిగినట్లుగా బుక్ మై షో సంస్థ పేర్కొంది.
Full View