18 పెజెస్ బిజినెస్.. హిట్టయితే జాక్ పాట్!

Update: 2022-12-22 02:30 GMT
ఈ ఏడాది కార్తికేయ 2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న నిఖిల్ సిద్ధార్ధ్ ఇప్పుడు మరొక డిఫరెంట్ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అందించిన కథతో ఆయన శిష్యుడు సూర్య ప్రతాప్ తెరపైకి తీసుకువచ్చిన 18 పెజెస్ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక మార్కెట్లో ఈ సినిమా ఎంత బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళితే. ముందుగా అయితే 18 పెజెస్ సినిమా నాన్ థియేట్రికల్ గానే మంచి ప్రాఫిట్ అందించినట్లు సమాచారం.

సినిమాను 16 కోట్ల బడ్జెట్ నిర్మించారు. అయితే డిజిటల్ రైట్స్ ఆడియో రైట్స్ శాటిలైట్ రైట్స్ ఇలా అన్ని రకాలుగా కలుపుకొని 22 కోట్ల వరకు అందించినట్లు సమాచారం.

ఒక విధంగా ఆ రూట్లోనే సినిమా 6 కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్ అందించింది. ఇక గీత ఆర్ట్స్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి చాలా ప్రదేశాల్లో ఈ సినిమాను సొంతంగానే విడుదల చేసుకుంటున్నారు. ఇక వ్యాల్యుడ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే నైజాంలో 3.5 కోట్లు, సీడెడ్ లో 1.5 కోట్లు ఆంధ్రలో ఐదు కోట్లు ఇక మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమా 10 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం.

కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 50 లక్షల రేంజ్ లో ధర పలికిన ఈ సినిమా ఓవర్సీస్ లో 1.50 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక టోటల్ గా వరల్డ్ వైడ్ 18 పేజెస్ దాదాపు 12 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఫైనల్ గా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే 12.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాల్సి ఉంటుంది. మరి నిఖిల్ సిద్దార్ధ్ ఈ సినిమాతో ఎలాంటి కలెక్షన్ సొంతం చేసుకుంటాడో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News