గౌతమ్ మీనన్ తెరకెక్కించిన క్లాసిక్ చిత్రాల్లో చెలి (తెలుగు) కి ప్రత్యేక స్థానం ఉంది. ఆర్.మాధవన్ - రీమా సేన్ -అబ్బాస్ మధ్య ముక్కోణ ప్రేమకథా చిత్రమిది. కాలేజ్ కుర్రాళ్లను ఓ రేంజులో ఊపింది. ఇక ఈ చిత్రానికి హ్యారిస్ జైరాజ్ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణ. ఒక రకంగా ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్ ఆల్బమ్ తో ఓ ఊపు ఊపారు అప్పట్లో. ఎక్కడ విన్నా చెలి పాటలే వినిపించేవి. ఇక ఈ మూవీని కాలేజ్ గ్యాంగ్ గొడవల నేపథ్యం ముక్కోణ ప్రేమ నేపథ్యం జోడించి గౌతమ్ మీనన్ ఎంతో క్లాసీగా సహజసిద్ధంగా తెరకెక్కించిన తీరు ఆసక్తికరం.
ఇక ఇదే మూవీని హిందీలో మాధవన్ (మ్యాడీ) - దియా మీర్జా జంటగా తెరకెక్కిస్తే అక్కడా ఘనవిజయం సాధించింది. హిందీలో రెహ్నా హై తేరే దిల్ మెయిన్ (19ఏళ్లు) టైటిల్ తో.. తమిళంలో మిన్నలే (20ఏళ్లు) పేరుతో రూపొందింది. ఇక ఇరు భాషల్లోనూ పాటలు కూడా చార్ట్ బస్టర్ విజయం సాధించాయి. తాజాగా 20 ఏళ్ల మిన్నలే అంటూ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు మ్యాడీ. ఆర్ మాధవన్ 19 సంవత్సరాల ``రెహ్నా హై తేరే దిల్ మెయిన్..`` వేడుకలను జరుపుకోవడంతో సోషల్ మీడియా హీటెక్కింది. ఇన్ స్టాగ్రామ్ లో మాధవన్ సహనటి దియా మీర్జా అడుగుజాడల్లో నడుస్తూ ఉన్న వీడియో..తో ఆకట్టుకున్నారు. వార్షికోత్సవంలో దియా పంచుకున్న అదే వీడియోను మ్యాడీ పంచుకున్నారు. మాధవన్ ఆర్.హెచ్.టిడిఎమ్ ను గుర్తు చేయడమే కాకుండా ఆర్.హెచ్.టిడిఎమ్‌కి జన్మనిచ్చిన అసలు తమిళ చిత్రం మిన్నాలే వైపు తిరిగి చూశారు.
మాధవన్ ఎగ్జయిట్ అవుతూ ``19 సంవత్సరాల RHTDM (20 సంవత్సరాల MINNALE). ఇది ప్రపంచవ్యాప్తంగా 19 సంవత్సరాల అపూర్వమైన ప్రేమ.. గుర్తింపు. మా గొప్ప కలలను నిజం చేసిన సినిమా ఇది. మీ ఆప్యాయతకు చాలా ధన్యవాదాలు. శాశ్వతంగా కృతజ్ఞతలు`` అని వ్యాఖ్యానించారు.
అతను హిందీలో ``పటా నహీ హమ్ ఇస్కే హక్దార్ హై భీ యా నహీ పార్ ఇష్యూ ధెర్ సారా ప్యార్ యువర్ అదర్ కే లియే భౌత్ ధైవాద్.. హమ్ హమేషా ఆప్కే దిల్ మెయిన్ రెహ్నా చాహతే హై ఈ ప్రయాణ ప్రేమను జరుపుకోవడం # 19YearsOfRHTDM మేము ఈ ప్రేమకు అర్హులం కాదా అనేది తెలియదు కాని మీరు ఈ చిత్రంపై చూపించిన ప్రేమ అనురాగాలు.. గౌరవానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మేము ఎల్లప్పుడూ మీ హృదయాల్లో ఉండాలని కోరుకుంటున్నాము.. అని వ్యాఖ్యను జోడించారు.
తన చిరస్మరణీయ చిత్రాన్ని జరుపుకునేటప్పుడు దియా మీర్జా కూడా ఇదేవిధమైన మనోభావాలను ప్రతిస్పందించింది. ``ఈ చిత్రం విడుదలైనప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. 19 సంవత్సరాలుగా మీరు మాకు ప్రేమను ఇచ్చారు. ఇది నా హృదయానికి చాలా దగ్గరగా ఉంది. ఈ ప్రయాణ ప్రేమను జరుపుకుంటుంది.. అని దియా ఎగ్జయిట్ అయ్యింది.