2.0 ఏ లాంగ్వేజ్ లో ఎంత ?

Update: 2018-12-02 07:43 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ శంకర్ ల కాంబోలో రూపొందిన 2.0 స్టేటస్ ని డిసైడ్ చేయడానికి ఇంకా టైం పడుతుంది కాని విడుదలైన మూడు రోజుల వరకు వివిధ బాషలలో 2.0 ఏ మేరకు వసూలు చేసిందన్న లెక్కల రకరకాల విశ్లేషణలకు అవకాశం కల్పిస్తున్నాయి. తమిళ్ తెలుగు హింది మొత్తం మూడు లాంగ్వేజెస్ లో విడుదల చేసిన 2.0 అన్ని చోట్లా ఒకేరకంగా పెర్ఫార్మ్ చేయకపోవడం విశేషం. తెలుగులో మొదటి రోజు 12 కోట్లకు పైగా షేర్ తో షేక్ చేసిన తలైవా రెండో రోజు 7 కోట్ల దగ్గరికి వెళ్ళి ఆగిపోయి కాస్త ఖంగారు పుట్టించాడు. అయితే నిన్న ఈ రోజు హాలిడేస్ ని బాగా వాడుకుంటున్నట్టు వసూళ్లు చెబుతున్నాయి.

సోమవారం ఉదయానికి 30 కోట్ల మార్క్ దాటాలి అనేది ట్రేడ్ అంచనా. అయితే ఆ తర్వాత 75 కోట్ల దాకా ప్రయాణం చేయడం అంత ఈజీ కాదు. వీక్ డేస్ ని కూడా అన్ని సెంటర్స్ ఫుల్ చేయించాలి. కాని టాక్ ని బట్టి చూస్తే అది చేరుకోవడం అసాధ్యమని అనిపిస్తోంది. ఇక హింది వెర్షన్ మొదటి రోజు 20 కోట్ల పైచిలుకు ఓపెనింగ్ తో కొంత షాక్ ఇచ్చినా ఆ తరవాత వీకెండ్ లో మంచి పికప్ చూపిస్తోంది. రెండో రోజు కేవలం 10 శాతం మాత్రమే డ్రాప్ కనిపించడం పెద్ద ఊరట. వీకెండ్ కంతా 90 కోట్ల గ్రాస్ ని రీచ్ కావొచ్చని అంటున్నారు. అదే జరిగితే హింది వెర్షన్ మిగలిన వాటి కంటే బాగా చేస్తున్నట్టు లెక్క. అయినా కూడా 150 కోట్ల దాకా 2.0 రాబట్టాల్సి ఉంటుంది.  బాలీవుడ్ లో ఇంకే పోటీ సినిమా లేదు కాబట్టి ఛాన్స్ ఉంది.
 
ఇక ఒరిజినల్ తమిళ్ వెర్షన్ మాత్రం వీటికి భిన్నంగా ఉంది. ఫస్ట్ డే కబాలిని కొద్ది గ్యాప్ లో మిస్ కావడం అసలు ట్విస్ట్. తమిళ్ కంటే తెలుగులోనే వసూళ్లు బాగున్నాయి. 180 కోట్ల గ్రాస్ టార్గెట్ తో తమిళ్ లోనే 2.0 అతి పెద్ద సవాల్ కు ఎదురీదుతున్నాడు. యుఎస్ లో ఫస్ట్ డే కాస్త నిరాశజనకంగా ఉన్నా రెండో రోజు నుంచి పికప్ కావడం ఓవర్సీస్ బయ్యర్లను కాస్త తెరిపినిచ్చింది. నిన్న మిలియన్ మార్క్ టచ్ అయిపోయింది అనే టాక్ వచ్చింది కాని ఇంకా ఖరారు కావాల్సి ఉంది. కాని పెట్టిన పెట్టుబడి లెక్కల్లో చూసుకుంటే అక్కడైనా 2.0 రాబట్టాల్సింది చాలా ఉంది. మరి ఈ నాలుగు సవాళ్ళను చిట్టి 2.0 ఎలా ఎదురుకుంటాడో వేచి చూడాలి.


Tags:    

Similar News