స్నీక్ పీక్‌: 2.ఓ మేకింగ్ ట్రీట్‌

Update: 2018-10-02 06:01 GMT
2018-19 మోస్ట్ అవైటెడ్ మూవీగా సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ - అక్ష‌య్‌- శంక‌ర్ మూవీ `2.ఓ` పాపుల‌రైంది. దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్‌ తో  ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నామ‌ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ చెబుతోంది. న‌వంబ‌ర్ 29 రిలీజ్ తేదీ. ఆ క్ర‌మంలోనే భారీ విజువ‌ల్ ట్రీట్ ఉంటుంద‌న్న అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇదివ‌ర‌కూ రిలీజైన టీజ‌ర్‌ కి మిక్స్‌ డ్ టాక్ రావ‌డంతో ఈ దీపావ‌ళి(న‌వంబ‌ర్ 8)కి రిలీజ్ చేయ‌బోతున్న ట్రైల‌ర్‌ పై శంక‌ర్ ప‌దింత‌లు గ్రౌండ్ వ‌ర్క్ చేస్తున్నార‌న్న స‌మాచారం ఉంది. టీజ‌ర్‌ లో మిస్స‌యింది, ట్రైల‌ర్‌ లో మిస్ చేయ‌కూడ‌ద‌న్న పంతంతో ఉన్నారుట‌.

ఆ క్ర‌మంలోనే 2.ఓ స్నీక్ పీక్ అంటూ తాజాగా మేకింగ్ విజువ‌ల్‌ని శంక‌ర్ బృందం రిలీజ్ చేసింది. ఈ మేకింగ్ వీడియోలో సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీ చిట్టీ రోబో గెట‌ప్‌, కిలాడీ అక్ష‌య్ కుమార్ క్రోమ్యాన్ గెట‌ప్ ఎలా తీర్చిదిద్దుతున్నారో - ఆ పాత్ర‌ల‌పై ఎలాంటి షాట్స్‌ ని డిజైన్ చేశారో చూపించారు. అలాగే ఈ సినిమాకి ప‌నిచేసిన టెక్నీషియ‌న్ల లైవ్ వ‌ర్క్‌ ని చూపించారు. స్వ‌ర‌మాంత్రికుడు ఏ.ఆర్‌.రెహ‌మాన్ మ‌రోసారి త‌న‌దైన శైలిలో ఆర్‌.ఆర్‌ తో మ్యాజిక్ చేసేందుకు ఎంత‌గా శ్ర‌మిస్తున్నారో క‌నిపించింది. అలాగే దాదాపు 2150 వీఎఫ్ ఎక్స్ షాట్స్‌ - 1000 కాంప్లెక్స్‌ వీఎఫ్ ఎక్స్ షాట్స్‌ని శంక‌ర్ తీర్చిదిద్దారు. 1300 ప్రీవిజ‌న్ షాట్స్‌ - వి-క్యామ్ టెక్నాల‌జీ - స్పైడ‌ర్ కామ్ సిస్ట‌మ్స్‌ - లిడార్ స్కానింగ్ వంటి అత్యున్న‌త సాంకేతిక‌త‌ను ఈ చిత్రం కోసం ఉప‌యోగించామ‌ని టీజ‌ర్‌ లో వెల్ల‌డించారు. ఆద్యంతం 3డి కెమెరాల‌తో ఈ సినిమాని తీర్చిదిద్దామ‌ని వెల్ల‌డించారు.

టెక్నిక‌ల్ టీమ్‌ ని ప‌రిశీలిస్తే.. విదేశాల‌కు చెందిన 25 కంపెనీలు వీఎఫ్ ఎక్స్ కోసం ప‌ని చేశాయి. యాంథోని - ముత్తురాజ్ - శ్రీ‌నివాస‌న్ వంటి టెక్నీషియ‌న్ల ప‌నిత‌నం తెర‌పై క‌నిపించ‌నుంది. 10 మంది కాన్సెప్టు ఆర్టిస్టులు - 25 మంది 3డి డిజైన‌ర్లు - 500 మంది క్రాఫ్ట్‌ మెన్ ఈ చిత్రానికి ప‌ని చేశారు. సుభాష్ క‌ర‌ణ్ స‌మ‌ర్ప‌ణ‌లో క‌ర‌ణ్ జోహార్ అసోసియేష‌న్‌ తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని అందిస్తోంద‌ని ఈ మేకింగ్ వీడియోలో మ‌రోసారి లైవ్ చేశారు. అంటే ఉత్త‌రాదిన ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత‌ క‌ర‌ణ్ జోహార్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నార‌ని మ‌రోసారి ఖాయం చేశార‌న్న‌మాట‌. సుభాష్ క‌ర‌ణ్ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View


Tags:    

Similar News