శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ - అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలలో నటించిన '2.0' ఈరోజే విడుదలయింది. 2.0 క్రేజ్ భారీగా ఉందని నార్త్ అమెరికాలో సినిమాను 800 స్క్రీన్స్ లో విడుదల చేశారు. ఈ సినిమాకు ఇండియాలో స్పందన భారీగానే ఉన్నా యూఎస్ లో ప్రీమియర్స్ విషయంలో మాత్రం ఆశించినంత రెస్పాన్స్ దక్కలేదని వార్తలు వస్తున్నాయి. అందుకే బుధవారం నాటి ప్రీమియర్స్ కలెక్షన్స్ వివరాలను 2.0 యూఎస్ ఎ డిస్ట్రిబ్యూటర్ అయిన ప్రైమ్ మీడియా వారు వెల్లడించలేదని అంటున్నారు.
సహజంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయిన సమయంలో ట్రేడ్ విశ్లేషకులు రెన్ ట్రాక్ నుండి కలెక్షన్స్ ఫిగర్స్ తీసుకుని తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేస్తారు. ఇప్పటికే ప్రీమియర్స్ వివరాలు రావాల్సి ఉండగా ట్రేడ్ విశ్లేషకులు ఎవ్వరూ ఈ వివరాలు వెల్లడించకుండా ఉండడంతో 'బాహుబలి' కలెక్షన్స్ ను దాటలేక పోవడంతోనే ఇలా చేస్తున్నారని అంటున్నారు. బాహుబలికి యూఎస్ ప్రీమియర్స్ ద్వారా $3.5 మిలియన్స్ కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు '2.0' ఆ మార్క్ టచ్ చేయలేదని అంటున్నారు. ఈ సినిమా టికెట్ ధర $30 నిర్ణయించడం కూడా ప్రతికూలంగా మారి ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రైమ్ మీడియా వారు ప్రీమియర్ ఏర్పాట్లు సరిగా జరగలేదని ఫస్ట్ డే నుండి అంతా సవ్యంగా ఉంటుందని ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే ఇండియా లో హిందీ వెర్షన్ '2.0' మొదటి రోజు రూ.25 కోట్లకు పైగా వసూళ్ళు సాధిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 'రోబో' హిందీ వెర్షన్ ఫుల్ రన్ లో రూ. 20 కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు సీక్వెల్ మాత్రం మొదటి రోజే 'రోబో' ఫుల్ రన్ కలెక్షన్ దాటడం విశేషమే.