అరుదైన క్లబ్బులో 2.0

Update: 2018-12-11 04:20 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్- ఏస్ డైరెక్టర్ శంకర్ ల మాగ్నమ్ ఓపస్ ‘2.0’ అమెరికాలో అరుదైన మైలురాయిని అందుకుంది. అక్కడ 5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసిన నాన్-బాహుబలి సౌత్ ఇండియన్ సినిమాగా ఈ చిత్రం రికార్డు సృష్టించింది. ‘బాహుబలి: ది బిగినింగ్’ యుఎస్ లో 5 మిలియన్ డాలర్లు కొల్లగొట్టిన తొలి చిత్రం. అది ఫుల్ రన్లో 6.9 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఆ తర్వాత ‘బాహుబలి: ది కంక్లూజన్’ దీనికి మూడు రెట్ల వసూళ్లు రాబట్టింది ఏకంగా 20 మిలియన్ మార్కును టచ్ చేసింది. ఐతే మరే దక్షిణాది చిత్రం కూడా 5 మిలియన్ మార్కును అందుకోలేదు. ‘బాహుబలి: ది బిగినింగ్’ తర్వాత వచ్చిన రజనీకాంత్ మూవీ ‘కబాలి’ వసూళ్లు 4.6 మిలియన్ల డాలర్ల దాకా వసూలు చేసింది. ఐతే ఇప్పుడు ‘2.0’ దాన్ని దాటింది.

సోమవారం నాడు ‘2.0’ ఐదు మిలియన్ల క్లబ్బులో అడుగు పెట్టింది. ఐతే ‘2.0’ ప్రయాణించాల్సిన దూరం ఇంకా ఉంది. ఈ చిత్రం అక్కడ బ్రేక్ ఈవెన్ కు రావాలంటే 7 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేయాలి. ఈ చిత్రానికి లాంగ్ రన్ ఉండటం కలిసొస్తోంది. రెండో వీకెండ్లో అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టి ‘2.0’ 3-4 వీకెండ్లలోనూ చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతుందని భావిస్తున్నారు. ఐతే ఫుల్ రన్లో కూడా 7 మిలియన్ మార్కును మాత్రం అందుకోలేకపోవచ్చు. 6 మిలియన్లయితే గ్యారెంటీ అనుకోవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 50 కోట్ల షేర్ మార్కుకు చేరువగా ఉంది. ఇక్కడ ఇంకో 20 కోట్లకు పైగా షేర్ రాబడితేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. హిందీలో మాత్రం ‘2.0’ ఇప్పటికే లాభాల బాట పట్టింది. అక్కడ ఈ చిత్రం రూ.170 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేయడం విశేషం. తమిళనాట వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు.


Tags:    

Similar News