6 నవంబర్ .. గురువారం .. గజగజ ఒణికించే ట్రీట్ ఉంది. అభిమానులూ.. బీ రెడీ.. ఈ ట్రీట్ అలాంటిలాంటి ట్రీట్ కాదు. భూమండలం కదిలిపోయే భీకరమైన ట్రీట్. అంత స్పెషల్ ఏంటో.. ఇంతకీ ఏమా ట్రీట్? అంటే కాస్త డీప్‌గా వివరాల్లోకి వెళ్లాల్సిందే.
సూపర్‌స్టార్ రజనీకాంత్ - అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో శంకర్ తెరకెక్కిస్తున్న 2.ఓ ఫస్ట్ లుక్ సహా టీజర్ ఇటీవల రిలీజై ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 2.ఓ టీజర్ యూట్యూబ్ లో జెట్‌స్పీడ్‌తో దూసుకెళుతూ 10 కోట్ల వ్యూస్ మార్క్ ని అందుకుంది. ఇప్పటికీ అదే సునామీ స్పీడ్ తో భారీవ్యూస్ తో దూసుకెళుతోంది. ఈ టీజర్ గురించి ఇంకా మాటా మంతీ సాగుతుండగానే మరో అదిరిపోయే ట్రీట్ కి శంకర్ సన్నాహాలు చేస్తున్నారు. మొన్న రిలీజైన టీజర్ కేవలం ఒకటిన్నర నిమిషం మాత్రమే. కానీ ఈసారి దీపావళి కానుకగా నవంబర్ 6న ఏకంగా ఒక బిగ్ రేంజ్ ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ ట్రైలర్ కాస్తంత పెద్దగానే ఉంటుందిట. ఇంచుమించు 4-5 నిమిషాల పాటు కళ్లు తిప్పుకోనివ్వనంత ఉత్కంఠను ఇస్తుందిట. తెలుగు - తమిళం - హిందీ ట్రైలర్ల ను ఇప్పటికే 2.ఓ టీమ్ రెడీ చేస్తోంది. చెన్నయ్ రెహమాన్ స్టూడియోస్ లో ట్రైలర్ కట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా రీరికార్డింగ్ ప్రతాపమంతా ఈ ట్రైలర్ లో చూపించేందుకు ఏ.ఆర్.రెహమాన్ సిద్ధమవుతున్నారుట. ఇదివరకూ టీజర్ లో వీఎఫ్ ఎక్స్ వర్క్ ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఏకంగా 1000 వీఎఫ్ ఎక్స్ షాట్స్ ఉంటాయిట. వీటి కోసం ఏకంగా 15 టాప్ రేంజ్ హాలీవుడ్ స్టూడియోస్ లో దాదాపు 3000 మంది రేయింబవళ్లు శ్రమించారట. ఇక ఇది పూర్తి స్థాయి 3డి సినిమా కాబట్టి అందుకు తగ్గట్టే గ్రాఫిక్స్ - వీఎఫ్ ఎక్స్ వర్క్ సింక్ కోసం చాలానే శ్రమించాల్సి వచ్చిందిట. నవంబర్ 29న సినిమా రిలీజ్ కానుంది. ఈలోగానే దీపావళికి అదిరిపోయే ట్రీట్ రెడీ అవుతోంది