అప్పుడప్పుడు కొన్ని మీడియాలా వల్ల అలాగే ప్రముఖ దిన పత్రికల ద్వారా ఏ స్టార్ హోదా ఎంతవరకు ఉందొ మనకు తెలుస్తూ ఉంటుంది. ఇక ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరి స్థాయి ఎంతవరకు ఉందొ వారికి ఏ ర్యాంక్ ఉందొ అనే విషయాలని తరచు చెబుతుండే ప్రముఖ ఫోర్బ్స్ ఈ సారి టాప్ 100 ఇండియన్ సెలబ్రెటీస్ విరే అని ఒక రీసెర్చ్ రిజల్ట్ ని రిలీజ్ చేసింది. 2016 అక్టోబర్ 1 నుండి 2017 సెప్టెంబర్ 30 వరకు ఉన్న ఎంటర్ టైన్మెంట్ సంబంధిత ఆదాయాల అంచనాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఆధారపడి ఉన్నాయి.
ఇందులో స్పెషల్ ఏమిటంటే ఈ సారి మన టాలీవుడ్ తారలు కూడా టాప్ 100 లిస్ట్ లో ఉండడం ప్రశంసించదగిన అంశం. ముఖ్యంగా బాహుబలి టీమ్ టాప్ 50 లోపు ర్యాంకులను అందుకుంది. ముందుగా దర్శకుడు రాజమౌళి 55 కోట్ల ఆదాయంతో 15 వ స్థానాన్ని అందుకున్నారు. బాహుబలి ప్రభాస్ 36.25 కోట్ల ఆదాయం అందుకొని 22 వ స్థానంలో నిలిచారు. రానా రూ.22 కోట్లతో 36వ ర్యాంక్ ను దక్కించుకున్నాడు. ఇక మరో మన సూపర్ స్టార్ స్పైడర్ సినిమాను ఒకేసారి తెలుగు తమిళ్ లో తెరకెక్కిచిన సంగతి తెలిసిందే.
రూ.19.63 కోట్లతో మహేష్ బాబు 37 వ ర్యాంక్ లో ఉన్నాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 11.33 కోట్లతో 69 వ ర్యాంక్ తో సరిపెట్టుకున్నాడు. అల్లు అర్జున్ కూడా ఈ ఇయర్ 81 వ ర్యాంక్ లో నిలిచాడు (7.74 కోట్లు). ఇక టాప్ 100 జాబితాలో ఉన్న ఇతర సినిమా ప్రముఖుల్లో మొదట బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 232.83 కోట్లు ఉండగా ఆ తరువాత వరుసగా షారుఖ్ ఖాన్ 170.50 కోట్లు - భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ 100.72 కోట్లతో 2 - 3 స్థానాల్లో ఉన్నారు.