2017 సంవత్సరంలో అత్యధిక ఆదాయం సంపాదించిన 100 మంది సెలబ్రిటీల జాబితాను ప్రముఖ ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఈ జాబితాలో దక్షిణాది నుంచి దర్శక ధీరుడు జక్కన్న తొలి స్థానంలో నిలిచాడు. 55కోట్ల ఆదాయంతో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ టాప్-100 లిస్ట్ లో రాజమౌళి 15స్థానంలో నిలిచాడు. ఇక ఓవరాల్ గా ఈ జాబితాలో బాలీవుడ్ ఖాన్ ద్వయం తొలి రెండు స్థానాల్లో నిలిచింది. గత ఏడాది టాప్ ప్లేస్ లో ఉన్న కండల వీరుడు సల్మాన్ ఖాన్ ... ఈ ఏడాది తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 232.83 కోట్ల ఆదాయంతో సల్లూ భాయ్ మొదటి స్థానంలో నిలవగా - బాలీవుడ్ బాద్షాహ్ షారుక్ ఖాన్ రూ.170 కోట్లతో రెండో స్ధానంలో నిలిచాడు.
టీమిండియా కెప్టెన్ - కొత్త పెళ్లి కొడుకు విరాట్ కోహ్లి రూ 100.72 కోట్లతో 3వ స్థానంలో నిలిచాడు. అక్షయ్ కుమార్ - సచిన్ టెండూల్కర్ - అమీర్ ఖాన్ - ప్రియాంక చోప్రా - ధోనీ - హృతిక్ రోషన్ - రణ్ వీర్ సింగ్ లు టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. దక్షిణాదిలో జక్కన్న తర్వాత రెండో స్థానంలో ప్రభాస్ ఉన్నాడు. రూ.36.25 కోట్ల ఆదాయంతో ఓవరాల్ గా ప్రభాస్ 22వ స్థానంలో ఉన్నాడు. రూ. 34 కోట్లతో 25వ స్థానంలో సూర్య - రూ. 29 కోట్లతో 31వ స్థానంలో విజయ్ - రూ.22 కోట్లతో 36వ స్థానంలో రాణా - రూ.19.63 కోట్లతో 37వ స్థానంలో మహేష్ - రూ. 11.33 కోట్లతో 69వ స్థానంలో పవన్ - రూ. 11.03 కోట్లతో 73వ స్థానంలో మోహన్ లాల్ - రూ.7.74 కోట్లతో అందరికంటే చివరగా 81 వ స్థానంలో అల్లు అర్జున్ ఉన్నారు.