ఒక్కటంటే ఒక్క హిట్టు పడలేదు. ఒక వేళ హిట్టొచ్చినా ఆ తరువాత వచ్చిన సినిమాలు ఆశించి స్థాయి లో ఆకట్టుకో లేదు. అయినా ఆ హీరోలకు ఆఫర్ల కొదవేమీ లేదు. వరుస సినిమాలు వస్తూనే వున్నాయి. హిట్.. ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లని సొంతం చేసుకుంటున్నారు. అలా హిట్ల తో సంబంధం లేకుండా సినిమాలమీద సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరోలు నలుగురున్నారు. వాళ్ల ల్లో మూడు నుంచి నాలుగు చిత్రాల తో బిజీ గా వున్నవాళ్లున్నారు.
`అఆ` తరువాత నితిన్ కు ఒక్క హిట్టు కూడా లేదు. ఆ సినిమా 50 కోట్ల క్లబ్ లో చేర్చినా ఈ హీరోకు ఆ తరువాత ఒక్క సూపర్ హిట్ సినిమా పడలేదు. హను రాఘవపూడి హడావిడి చేసిన `లై`.. కృష్ణ చైతన్య `ఛల్ మోహన్‌రంగ` శ్రీనివాస కల్యాణం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ లుగా నిలిచాయి. అయినా అతని చేతిలో ఇప్పుడు భీష్మ- రంగ్‌దే.. చంద్రశేఖర్ ఏలేటి చిత్రం.. కృష్ణ చైతన్య సినిమా వున్నాయి. ఇదే వరుసలో అవకాశాలు పొందుతున్న మరో హీరో ఆది సాయి కుమార్. జోడీ- బుర్రకథ-ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఈ మూడు సినిమాలు పోయినా ఆది చేతి లో మూడు సినిమాలున్నాయి. అందులో ఒకటి `శశి` ఇప్పటికే మొదలైంది.
ఆ తరువాత వరుస లో వున్న హీరోలు అఖిల్- శర్వానంద్. అఖిల్ ఇప్పటి వరకు నటించిన అఖిల్- హలో- మిస్టర్ మజ్ను ఈ మూడు చిత్రాలు ఫ్లాపయ్యాయి. ఇప్పడు ఒకే ఒక్క సినిమా చేతిలో వుంది. శర్వానంద్ కు `మహానుభావుడు` తరువాత ఒక్క హిట్టు లేదు. పడి పడి లేచే మనసు- రణరంగం రెండూ ఫ్లాపయ్యాయి. ప్రస్తుతం శర్వా చేతిలో మూడు సినిమాలున్నాయి. కీరవాణి- 96 రీమేక్- శ్రీకారం. ఈ మూడు చిత్రాల్లో `96` రీమేక్ పైనే భారీ అంచనాలే వున్నాయి. ఎగ్రెస్సివ్ హీరో గోపీచంద్ పరిస్థితి ఇదే. 2018లో పంతం.. 2019లో చాణక్య ఫ్లాపులయ్యాయి. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వం లో సినిమా చేస్తున్నాడు. మరిన్ని క్యూలో ఉన్నాయి. ఈ ఐదుగురు హీరోలు హిట్ లు లేకున్నా మూడు నుంచి నాలుగు సినిమాల తో బిజీగా వుండటం నిజంగా విశేషమే.