ఈ ఏడాది ఆగస్టు వరకూ కొవిడ్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో తెలిసిందే. ఆంక్షలతో థియేటర్లు తెరుచుకున్నా ప్రేక్షకులు భయపడి వెళ్లలేని పరిస్థితి. అవన్నీ దసరా నుంచి అదుపులోకి వచ్చాయి. కోవిడ్ భయాన్ని వదిలేసి జనాలు థియేటర్ వైపు చూడటం మొదలు పెట్టారు. అప్పటి నుంచి సినిమాలు కూడా ఒక్కొక్కటిగా రిలీజ్ అయ్యాయి. `లవ్ స్టోరీ`..`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`.. `అఖండ`..`పుష్ప`..`శ్యామ్ సింగరాయ్` చిత్రాలు థియేటర్లో రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల రిలీజ్ లతో థియేటర్లు కళకళలాడాయి. ఇక ఏడాది ముగింపుకి ఇంకా మూడు..నాలుగు రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఏడాది చివర్లో థియేటర్లో..ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల జాబితా ఓసారి చూద్దాం.
డిసెంబర్ 31న ఏకంగా ఆరు సినిమాలు థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి. బాలీవుడ్ సినిమా `జెర్సీ` భారీ అంచనాల మధ్య 31న రిలీజ్ అవుతుంది. దీనికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఇది తెలుగు `జెర్సీ`కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత `1945`..`విక్రమ్`..`అర్జున పల్గుణ`..`సత్యాభామ`..`అంతఃపురం` చిత్రాలు ఇదే తేదీకి రిలీజ్ అవుతున్నాయి. ఇక వరుణ్ సందేశ్ నటించిన `ఇందు వదన` జనవరి 1న రిలీజ్ అవుతుంది. వరుణ్ కి ఈ సినిమా మంచి కంబ్యాక్ ఫిల్మ్ అవుతుందని చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి.
మరి కంటెంట్ పరంగా ఎలా ఉంటుందన్నది ప్రేక్షకులు నిర్ణయించాలి. `ఆశ ఎన్ కౌంటర్` అనే మరో సినిమా కూడా ఇదే తేదిన రిలీజ్ అవుతుంది. ఇక ఓటీటీలో `లేడీ ఆఫ్ మేనర్`.. `టైమ్ ఈజ్ ఆఫ్` చిత్రాలు అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్ 31 న రిలీజ్ అవుతున్నాయి. `సేనాపతి` ఇదు తేదీని ఆహాలో ప్రసారం కానుంది. `ది పోస్సెసన్ ఆఫ్ హన్నా గ్రేస్` డిసెంబర్ 27న.. `ఛోటాబీమ్ ఎస్-14`..`కోబ్రా కాయ్ సీజన్-4`..`దిలాస్ట్ డాటర్` చిత్రాలు డిసెంబర్ 31న రిలీజ్ అవుతున్నాయి.