2023 ఆ బ్యూటీకి వెరీ స్పెష‌ల్ !

Update: 2023-01-06 08:40 GMT
బాలీవుడ్ హాట్ బ్యూటీ  భూమిప‌డ్నేక‌ర్ కెరీర్ మూడేళ్ల‌గా ఫుల్ స్వింగ్ లో  ఉంది. మీడియం బ‌డ్జెట్ లోనే అమ్మడు న‌టించిన సినిమాలు ఏడాదికి నాలుగైదైనా రిలీజ్ అవుతున్నాయి. వాటి స‌క్సెస్ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే న‌టిగా మాత్రం బిజీగానే ఉంది. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా అవ‌కాశాలు అందుకుంటూ ముందుకెళ్లిపోతుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డి క్యాలెండ‌ర్ తిర‌గేస్తే అర‌డ‌జ‌న‌కు పైగానే సినిమాలు చేతిలో ఉన్నాయి. తాజాగా కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టిన భూమీ  కెరీర్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

'ఒక మ‌నిషి ఒక రకంగానే జీవించ‌గ‌ల‌డు. కానీ న‌టుల‌కు మాత్రం ఎన్నో పాత్ర‌ల్లో న‌టించి  అన్న‌ర‌కాల జీవితాలు ఆస్వాదించ‌గ‌ల‌రు. ఇది న‌టుల‌కు మాత్ర‌మే ద‌క్కే ఓ వ‌రం.  న‌టిగా నాకు  2023 గుర్తిండిపోయే సంవ‌త్స‌రం అవుతుంద‌ని ఆశిస్తున్నా. ఈ ఏడాది నేను న‌టించిన ఆరు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆరింటిలోనూ ఆరు ర‌కాల  వైవిథ్య‌మైన పాత్ర‌లు పోషిస్తున్నాను.

ఆర‌కంగా ఒకే ఏడాదిలోఆరు ర‌కాల పాత్ర‌ల్లో ప్రేక్ష‌కులు న‌న్ను చూస్తారు.  ఇది నాకు చాలా ఆస‌క్త‌గా అనిపిస్తుంది.  ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతార‌ని నేను చాలా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నా.  న‌టించిన ప్ర‌తీ పాత్ర కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాను.  ఇది నేను ఎంతో ఇష్ట‌ప‌డి చేసిన ప‌ని.   కాబ‌ట్టి ఏ స‌మ‌యంలోనూ చికాకుగా ఫీల‌వ్వ‌లేదు. యాక్టింగ్ ప‌రంగా రోజూ ఏదో కొత్త విష‌యం తెలుసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటాను.

ఆ క్ర‌మంలోనే చాలా విష‌యాలు అర్ధమ‌వుతున్నాయి. న‌టిగా ఈ రంగంలో కొన‌సాగ‌డం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను' అని తెలిపింది. అలాగే అమ్మడికి తెలుగు సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చినా న‌టించ‌డానికి సిద్దంగానే ఉన్నానంటోంది. మ‌రి టాలీవుడ్ ప్రోత్సాహం  ఎలా ఉంటుందో చూడాలి.  ప్ర‌స్తుతం ఈ బ్యూటీ 'భేడ్'..'లేడీ కిల్ల‌ర్'.. 'ఆప్వా'..'భ‌క్ల‌క్'.. 'మేరా హాజ్బెండ్కి బీవీ' తో పాటు మ‌రో రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. మొత్తానికి అమ్మ‌డు 2023 ముగిసే వ‌ర‌కూ థియేట‌ర్లో సంద‌డి చేయ‌డం ఖాయంగానే క‌నిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News