కిస్సు ప్రశ్నలపై కస్సుబుస్సులాడిన హీరో

Update: 2018-11-21 06:01 GMT
అదిత్ అరుణ్.. హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లు గా '24 కిస్సెస్' అనే సినిమా తెరకెక్కింది.  ఇప్పటికే ఈ సినిమాలో కిస్సు సీన్ల గురించి నానా రచ్చ జరుగుతోంది. రీసెంట్ గా ఒక టీవీ ఛానల్ డిబేట్ లో హెబ్బాను 'నీది తప్పు.. తప్పు.. తప్పు..తప్పు' అని వేధించడంతో ఆ షో నుండి వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. తాజాగా మరో వెబ్ చానెల్ ఇంటర్వ్యూ లో హీరోకి మరోరకమైన పరిస్థితి ఎదురైంది. ఆ యాంకర్ ఇంటర్వ్యూ అంతా 'కిస్సు' చుట్టూ తిప్పడంతో హీరో కస్సుబస్సులాడాడు.

 "హెబ్బా పటేల్ చాలా బాగుంటుంది. ఎన్నో కిస్సెస్ చేశారు. ఇక రియల్ లైఫ్ లో ఎంతమందిని చేసుంటారో ఏమో నాకైతే ఎగ్జాక్ట్ గా తెలియదు." అని ఒక ఇరిటేటింగ్ ఎక్స్ ప్రెషన్ తో హీరోను అడిగే సరికి హీరో అదిత్ అరుణ్ కోపం నషాళానికి అంటింది. "స్టార్టింగ్ నుంచి నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను బాగానే ఆన్సర్ చెబుతున్నారు.. నువ్వు మళ్ళీ మళ్ళీ అదే విషయం(సేమ్ ఫ... థింగ్) అడుగుతున్నావు. ఇక నువ్వు ఇదే అడుగుతాంటే నేను ఇంటర్వ్యూ చేయను.  ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో నన్ను ఈ కిస్సింగ్ గురించి అడిగారు. నేను అందరికీ జవాబిచ్చాను. నువ్వు కూడా అడిగావు. నేను జవాబు చెప్పా. అదే పనిగా కిస్సింగ్ గురించి ఎన్ని సార్లు అడుగుతావు..  నీకేం కావాలి.. ఇంతకీ నీకేం చెప్పాలి నేను?" అన్నాడు. దానికి సమాధానంగా "కిస్సింగ్ గురించి" అంటూ కూల్ గా ఆన్సర్ ఇచ్చాడు యాంకర్.   

"నువ్వు ఇంతకు ముందే అడిగావు. నేను ఆన్సార్ ఇచ్చాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వాటిగురించి మాట్లాడుకుందామా వద్దా?" అన్నాడు. దానికి మళ్ళీ ఆ యాంకర్ "నేను ఆ క్వశ్చన్ అడిగిన ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీలో హీరో అన్నాక ఇలాంటివి చాలా జరుగుతుంటాయి కదా?" అన్నాడు .. దెబ్బకి హీరో అక్కడినుండి వెళ్ళిపోయేందుకు లేచాడు.  ఆ యాంకర్  అదిత్ ని రిక్వెస్ట్ చేసిన కూర్చోబెట్టాడు.  ఇక మళ్ళీ హీరో యాంకర్ పై ఫైర్ అయ్యాడు "హీరో అంటే ఎప్పుడు ఏదో ఒక అమ్మాయిని ****** తిరుగుతాడాని అనుకుంటున్నావా?"

ఇంటర్వ్యూ అంతా ఇలా హై పిచ్ లో సాగింది. ఇబ్బంది పెట్టేలా పర్సనల్ క్వశ్చన్లు అడగడం ఏంటని.. అవే ప్రశ్నలు నిన్నడిగితే ఎలా ఉంటుందని యాంకర్ ను అడిగాడు. అప్పటికీ యాంకర్ వదలకుండా 'ఫ్రెండ్లీగా అడిగాను' అన్నాడు.  అలా అయితే కెమెరా ఆఫ్ చేసి బయట చాయ్ తాగుతూ మాట్లాడుకుందామని హీరో అన్నాడు.  ఓవరాల్ గా ఆ యాంకర్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు.  సినిమాలో కిస్సులగురించి ఆడగడం సరేగానీ వేధించేలా ప్రశ్నలు వేయడం సరికాదని.. యాంకర్ కు బాగానే గడ్డి పెట్టాడని నెటిజనులు అంటున్నారు. మరోవైపు.. కొందరు నెటిజనులు మాత్రం హీరో అన్నాక కాస్త ఎమోషనల్ బ్యాలెన్సు ఉండాలని ఇలా చిరాకు పుట్టే ప్రశ్నలు వేసినప్పుడు 'నో కామెంట్' అని 'మరో టాపిక్ మాట్లాడండి' అని చెప్పడం తెలివైన పని అని సూచిస్తునారు. సీనియర్ హీరోలను చూసి ఇంటర్వ్యూ లు ఎలా చేయాలో నేర్చుకోవాలని అంటున్నారు. ఎదేమైనా కానివ్వండి.. సినిమాకు ఫుల్లు పబ్లిసిటీ.


Tags:    

Similar News