ప్రస్తుతం సౌత్ లో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ అయిన రజనీకాంత్ సినిమా 2.0 సినిమాలో ఓ పాట కోసం రూ. 5 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. రూ. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా కావడం... సాధారణంగా శంకర్ సినిమాల్లో పాటలన్నీ ఓ రేంజిలో ఉంటాయి కాబట్టి ఆ మాత్రం బడ్జెట్ అవడం మామూలే. కానీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న సినిమా జయ జానకి నాయకలో ఓ పాట కోసం రూ. 3 కోట్లు ఖర్చు పెడుతుండటం టాలీవుడ్ ను ఆశ్చర్య పరుస్తోంది.
మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న జయ జానకి నాయక సినిమా కోసం ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి ధారాళంగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఈ సినిమాలో డిస్కో బాబు సాంగ్ కో్సం విశాఖపట్నంలో బీచ్ ఫెస్టివల్ నేపథ్యంలో ఓ పాట షూటింగ్ నిమిత్తం రూ. 3 కోట్లు ఖర్చు చేశారు. ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ ఇందుకోసం అద్దిరపోయే సెట్ వేశారు. ఈ పాటలో డ్యాన్స్ చేయడానికి లండన్ నుంచి 300 మంది డ్యాన్సర్లను తీసుకొచ్చారు. ప్రేమ్ రక్షిత్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించాడు.
జయ జానకి నాయక సినిమాలో బోయపాటి శ్రీను గ్లామర్ డోస్ కూడా బాగా పెంచాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ లో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ తోపాటు ప్రగ్యా జైస్వాల్ - కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాధారణంగా బోయపాటి శ్రీను సినిమాలో ఫైట్ సీన్లే మేజర్ హైలైట్ గా నిలుస్తాయి. ఇంతవరకు అతడు తీసిన సినిమాల్లో సాంగ్స్ కోసం భారీగా ఖర్చు పెట్టిందీ లేదు. దీనికితోడు బెల్లంకొండ శ్రీనివాస్ కు అంత మార్కెట్ లేదు. సినిమా మరీ సూపర్ గా ఉంటేనే పెట్టిన పెట్టుబడి తిరిగి చేతికొస్తుంది. అలాంటిది ఒక పాట కోసం రూ. 3 కోట్లు ఖర్చు పెట్టడమంటే టూమచ్ అనే చెప్పాలి. ఆగస్టు 11న జయ జానకి నాయక థియేటర్లకు రానుంది. ఆ పాట ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో.. లెట్స్ వాచ్ ఇట్.