వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న్నాడు యువ హరో శర్వానంద్. ఇప్పుడు ''ఒకే ఒక జీవితం'' అనే కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు శర్వానంద్ పాత్రకి సంభందించిన స్నీక్ పీక్ ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా టీజర్ ను కోలీవుడ్ స్టార్ హీరో సూర్య లాంచ్ చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
'ఇప్పుడు నేను చెప్పబోయే విషయానికి మీరు ఆశ్చర్యపోవచ్చు.. అసలు నమ్మకపోవచ్చు కూడా.. కానీ మీరిది నమ్మే తీరాలి' అని నాజర్ చెప్పడంతో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇందులో శర్వా ఒక అప్ కమింగ్ మ్యూజిషియన్ గా కనిపించగా.. అతని స్నేహితులుగా వెన్నెల కిషోర్ - ప్రియదర్శి నటించారు. అలానే శర్వా తల్లిగా అక్కినేని అమల.. ప్రేయసిగా రీతూ వర్మ కనిపించారు.
'ఒకే ఒక జీవితం' టీజర్ చూస్తుంటే ఇది సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. సైంటిస్ట్ అయిన నాజర్ ప్రస్తుత కాలం నుంచి గతానికి వెళ్ళడానికి ఓ టైం మెషిన్ ని కనిపెడతారు. అయితే ఇందులో ఒక్కసారి మాత్రమే ప్రయాణించగలరనే కండిషన్ చెబుతారు. ఈ నేపథ్యంలో టైమ్ మిషన్ సహాయంతో శర్వా తన ఇద్దరు మిత్రులతో కలిసి తన బాల్యంలోకి వెళ్లినట్లు టీజర్ లో కనిపిస్తోంది.
శర్వానంద్ - వెన్నెల కిషోర్ - ప్రియదర్శి ముగ్గురు గతంలోకి వెళ్లి ఏమి చేశారు? ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అసలు బాల్యంలోకి వెళ్లి ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకోవాలని అనుకోవడానికి కారణమేంటి? అక్కడి నుంచి మళ్ళీ ప్రస్తుత కాలానికి వచ్చారా లేదా? అనేది తెలియాలంటే 'ఒకే ఒక జీవితం' సినిమా చూడాల్సిందే.
శర్వానంద్ కెరీర్ లో 30వ చిత్రంగా ''ఒకే ఒక జీవితం'' ను తెలుగు తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో శ్రీ కార్తిక్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు - ఎస్.ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో డైలాగ్స్ అందించడం విశేషం. జేక్స్ బీజోయ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. సుజీత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ వర్క్ చేశారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ''ఒకే ఒక జీవితం'' చిత్రాన్ని 2022 ప్రారంభంలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ వస్తున్న ఈ సినిమా.. శర్వానంద్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
Full View