30 వెడ్స్ 21: మేఘ‌న‌కు వెల్ కం టు అడ‌ల్ట్ వ‌ర‌ల్డ్

Update: 2022-01-31 14:02 GMT
అమ్మాయికి వ‌య‌సొచ్చాక ఒక అయ్య చేతిలో పెట్టాలి. కానీ ఈరోజుల్లో పెళ్లిళ్లు అన్నీ 10 ప్ల‌స్ ఏజ్ గ్యాప్ తోనే. అందుకేనేమో 30 వెడ్స్ 21 అంటూ టైటిల్ పెట్టారు. వ‌య‌సు గ్యాప్ లో యువ‌కుడిని పెళ్లాడే మ‌గువ ప‌రిణ‌తి ఎలా ఉంటుందో .. ప‌రిణ‌తితో ఉన్న యువ‌కుడి ప్ర‌వ‌ర్తన ఎలా ఉంటుందో కూడా ఈ చ‌క్క‌ని టీజ‌ర్ లో చూపించారు. సీజ‌న్ 1లో క్యూరియాసిటీని సీజ‌న్ 2లోనూ కొన‌సాగిస్తున్నామ‌నేందుకు సింబాలిక్ గా ఉంది టీజ‌ర్.

నాన్న భుజాల మీద ఎక్కి చూసే ప్ర‌పంచానికి మ‌న కాళ్ల మీద నిల‌బ‌డి చూసే ప్ర‌పంచానికి చాలా తేడా ఉంటుంది!.. మేఘ‌న వెల్ కం టు అడ‌ల్ట్ వ‌రల్డ్.. అంటూ అత‌డు మాట్లాడే ప్ర‌తి మాటా రియాలిటీకి ఎక్క‌డో క‌నెక్ట‌వుతూనే ఉంటుది.  ఏమీ తెలియ‌ని ప్ర‌పంచం నుంచి అన్నీ తెలుసుకుని వెళ్లాల్సిన స‌న్నివేశం వ‌స్తే ఏ యువ‌తి అయినా అంతో ఇంతో క‌న్ఫ్యూజ‌న్ లో ఉంటుంది. త‌న‌కు ఈ ప్ర‌పంచంలో ర‌క్ష‌ణ ఏది? హ‌బ్బీతో త‌దుప‌రి జీవితం ఎలా ఉంటుంది? అన్న‌ది తెర‌పై చూపించ‌బోతున్నారు. మొత్తానికి 30 వెడ్స్ 21 టీజ‌ర్ క్యూరియాసిటీని పెంచింది. న‌టీన‌టుల స‌హ‌జ‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఆక‌ట్టుకుంటోంది.

చైతన్య రావ్ - అనన్య న‌ట‌న యూత్ ను బాగా ఆక‌ట్టుకుంటోంది. ఛాయ్ బిస్కెట్ నిర్మాణ సంస్థ తెర‌కెక్కిస్తోంది. ``ఈ వేలంటైన్ నెలలో  మా చూడముచ్చటైన జంట మేఘన (అనన్య).. పృథ్వీ(చైతన్య) మిమ్మల్ని మరోసారి కలవడానికి వస్తున్నారు`` అంటూ ఈ సిరీస్ కొత్త పోస్టర్ ను ఇంత‌కుముందు విడుద‌ల చేయ‌గా వైర‌ల్ అయ్యింది.  రెండో సీజన్ కు  మనోజ్-అస‌మర్థ్ సంయుక్తంగా కథను అందిస్తున్నారు. జోస్ జిమ్మి సంగీతాన్ని అందించగా.. ప్రత్యక్ష్ రాజు ఛాయాగ్ర‌హ‌ణం అందించారు.


Full View
Tags:    

Similar News