300 లాంటి భారీ యాక్షన్ చిత్రంతో సినీప్రపంచ మేధావులను విస్మయపరిచిన దర్శకుడు జాక్ స్నైడర్. పూర్తిగా టెక్నాలజీ బేస్డ్ లో విజువల్ వండర్ ని తీర్చిదిద్దిన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా 300 చిత్రంలో స్లోమోషన్ ఎఫెక్ట్స్ లో అతడు తీర్చిదిద్దిన కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ గగుర్పొడిచేలా ఉంటాయి.
300 చిత్రంతో పాటు జస్టిస్ లీగ్ చిత్రానికి కూడా జాక్ స్నైడర్ కొంతభాగం దర్శకత్వం వహించారు. అయితే అతడి కుమార్తె చనిపోవడంతో ఆ సినిమా నుంచి మిడ్ వేలో తప్పుకోగా వేరొకరు మిగతా భాగం చిత్రీకరించారు.
స్నైడర్ పై ఒక రూమర్ కూడా ఉంది. ఆయన పోర్న్ తీయాలనుకుని యాక్షన్ సినిమాలు తీస్తున్నాడని గుసగుసలు ఉన్నాయి. 300 చిత్రంలో దేవుళ్ల ముసుగులో కొందరు వికృత కురూపిలు కన్నె పిల్లతో శృంగార వాంఛలు తీర్చుకునే సన్నివేశాన్ని ఎంతో కళాత్మకంగా చూపించిన విధానం మర్చిపోలేం. అది స్నైడర్ దగ్గర మాత్రమే ఉన్న టెక్నిక్. జస్టిస్ లీగ్ చిత్రంలోనూ అతడిలోని ఆ ఎలిమెంట్ బయటపడింది. శృంగార రసంపైనా ఓ సినిమా తీయాలనేది నా కోరిక. నా దృష్టిలో శారీరక వాంఛలతో మనిషి రగిలిపోతుంటాడు. వాటిని అణుచుకోవడం ఎందుకనే ఫిలాసఫీ మీదే నా ఫోకస్. ఇదివరకూ ప్రయత్నించినా నిర్మాణ సంస్థలు ఆఫర్లు ఇవ్వలేదని అన్నారు.
స్నైడర్ దర్శకత్వం వహించిన ఆర్మీ ఆఫ్ ది డెడ్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అలరిస్తోంది. ఈ చిత్రంలోనూ బోల్డ్ సన్నివేశాన్ని స్నైడర్ చూపించారు. డాన్ ఆఫ్ ది డెడ్- 300- వాచ్ మెన్- లెజెండ్ ఆఫ్ ది గార్డియన్స్- మ్యాన్ ఆఫ్ స్టీల్- బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ వంటి భారీ బ్లాక్ బస్టర్లను అతడు తెరకెక్కించారు.