ఇప్పటికీ చూడటానికి కుర్రాడే లాగే ఉన్నాడు. నిన్నటికి నిన్న సితార తో కలిసి షాపింగ్ కొస్తే వెంట ఉన్నది గౌతమేమో అనుకున్నారు. తెరపై రోజు రోజుకీ యవ్వనం గానే కనిపిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు వెండితెరపైకి వచ్చి అప్పుడే 41 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా లో సందడి చేస్తున్నారు. మహేష్ ప్రస్థానం మొదలై 41 ఇయర్స్ పూర్తయినట్లు రూపొందించిన సీడీపీ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సీడీపీలో ఓ పెద్ద భవంతి, దాని పక్కన మహేష్ మైనపు బొమ్మ చూడగానే ఆకట్టుకునేలా రూపొందించారు.
దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్షన్ లో 1979లో నీడ అనే సినిమా విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ బాబు బాల నటుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా విడుదలై ఈ ఏడాదితో 41 ఏళ్లు పూర్తవబోతున్నాయి.
ఇంకా యంగ్ గానే కనిపిస్తున్న మహేష్ బాబు సినీ ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే 41 ఇయర్స్ పూర్తయ్యాయంటే నమ్మబుద్ధవదు. ఎన్టీఆర్ -ఏఎన్నార్ తర్వాత తరంలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మాత్రమే సినీ ఇండస్ట్రీకి వచ్చి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత మహేష్ బాబే ఈ క్లబ్లోకి చేరారు.
మహేష్ బాబు బాల నటుడిగా నీడ సినిమా తర్వాత తండ్రి కృష్ణ, సోదరుడు రమేష్ బాబు తో కలిసి పోరాటం, శంఖారావం, కొడుకు దిద్దిన కాపురం, గూఢచారి 117, బజారు రౌడీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆ వయసులోనే మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నాడు. పదేళ్లు కూడా నిండకుండానే టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.
ఆ తర్వాత 1998 లో కే. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమా తో మహేష్ బాబు హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మూడో సినిమా మురారిలో చక్కటి నటనను కనబరిచి నంది అవార్డు కూడా పొందాడు. నాలుగవ చిత్రంతోనే తన తండ్రి లాగా టక్కరి దొంగలో కౌబాయ్ గా కనిపించి పెద్ద సాహసమే చేశాడు. ఒక్కడు సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ హిట్ కొట్టి వారెవ్వా అనిపించాడు.
ఆ సినిమా దగ్గర్నుంచి మహేశ్ కెరీర్ దూసుకెళ్లింది. నిజం సినిమాతో మరోసారి నంది అవార్డు అందుకున్నాడు. అతడు సినిమా తో హాలీవుడ్ హీరోలా స్టైలిష్ గా కనిపించాడు. ఇక పోకిరి సినిమాతో టాలీవుడ్ లోని సినీ రికార్డులన్నీ బద్దలు కొట్టాడు. మహేష్ బాబు కెరీర్ లోనే పోకిరి ఎంతో ప్రత్యేకం. ఆ సినిమాతోనే తన డైలాగ్ డెలివరీ కూడా మహేష్ బాబు పూర్తిగా మార్చుకున్నాడు. పోకిరి ఓ కొత్త మహేష్ బాబును ఇంట్రడ్యూస్ చేసింది.
ఆ తర్వాత మహేష్ బాబు నటించిన దూకుడు, బిజినెస్ మేన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను మహర్షి, తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు. శ్రీమంతుడు సినిమా తర్వాత ఎక్కువగా సామాజిక సందేశం ఉన్న సినిమాల్లో మహేష్ బాబు నటించాడు. భరత్ అనే నేను, మహర్షి మూవీలు ఆ కోవకు చెందినవే. ప్రస్తుతం మహేష్ బాబు పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు.