ఉమైర్ సంధు పేరు పరిచయం అక్కర్లేదు. ఈ స్వయం ప్రకటిత సినీక్రిటిక్ దుబాయ్ లో ఉంటారు. ఇంతకుముందు డార్లింగ్ ప్రభాస్ సాహో చిత్రానికి అద్భుత సమీక్ష రాసాడు. అయితే కొన్ని సినిమాలపై అరుదుగా వ్యతిరేక సమీక్షలు రాస్తూనే ఉన్నాడు. అయితే అతడు `ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్` కావడంతో ఈ సమీక్షలకు గౌరవం ఉంది. ఏదైనా పెద్ద సినిమా విడుదలకు చాలా ముందుగానే తన `రివ్యూలతో అతడు ఆటపట్టిస్తుంటాడు. తరచుగా ట్వీట్ రివ్యూలతో ఆకర్షిస్తూనే ఉన్నాడు. కానీ అతడు రాసే కొన్ని సమీక్షలు నమ్మడానికి చాలా బాగుంటాయి. కొన్ని సందేహాలు పుట్టిస్తాయి.
ఇప్పుడు ఉమైర్ సంధు షారూఖ్ నటించిన `పఠాన్` సమీక్షతో మరోసారి హాట్ టాపిక్ గా మారాడు. ఈ చిత్రం జనవరి 25 న భారీ హైప్ తో అతి భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ఉమైర్ తన ట్విట్టర్ లో పఠాన్ పై అన్ లిమిటెడ్ గా ప్రశంసలు కురిపించాడు. ఇంతకీ పఠాన్ గురించి అతడు ఏం రాసాడు? అంటే.. ``పఠాన్ చాలా ఎక్కువ కాలం ఆడే ఒక హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో మిరుమిట్లు గొలిపే యాక్షన్... అద్భుతమైన అంతర్జాతీయ లొకేషన్లు అబ్బురపరుస్తాయి. దర్శకుని స్టైలిష్ ఎగ్జిక్యూషన్ తో పాటు స్టైల్ కంటెంట్ ఇతర మెటీరియల్ కూడా ఆకట్టుకుంటాయి. మరీ ముఖ్యంగా # షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ ఈ చిత్రంలో నటించడం విలువను పెంచింది`` అంటూ సమీక్షను రాసాడు. అక్కడితో ఆగకుండా ఉమైర్ `పఠాన్`కి 5 స్టార్ రేటింగ్ కూడా ఇచ్చేశాడు.
అయితే క్రిటిక్ ఉమైర్ సమీక్షను చదివిన ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ అతడిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఉమైర్ సంధు తాను రాసిన (తరణ్) `ఏక్ థా టైగర్` రివ్యూను కాపీ కొట్టారని మండిపడ్డారు. తరణ్ ట్వీట్ చేస్తూ- ``ఈ నాన్సెన్స్ ఆపండి... మీరు #ఏక్ థా టైగర్ (2012)కి సంబంధించిన నా రివ్యూని కాపీ పేస్ట్ చేసారు. #పఠాన్ `రివ్యూ` కోసం దానినే ఉపయోగించారు`` అని విమర్శించారు. నా #ఏక్ థా టైగర్ రివ్యూ లింక్ ఇదిగో చూడండి అంటూ తరణ్ ఆ లింక్ ని షేర్ చేసారు.
ఉమైర్ సంధు ఈ లింక్ ని పరిశీలించి వెంటనే ట్వీట్ రివ్యూని డిలీట్ చేసి మళ్లీ మరో కొత్త రివ్యూని ట్వీట్ చేశాడు. అయినా ఎవరూ ఈ సమీక్షను పట్టించుకోవడం లేదు! ఇంతకుముందు సాహో చిత్రాన్ని ఉమైర్ సంధు మహదాద్భుతం అంటూ ప్రశంసిస్తూ సమీక్ష రాసాడు. కానీ ఆ సినిమా హిందీలో తప్ప ఇంకెక్కడా ఆశించినంతగా ఆడలేదు. మూవీ ఫ్లాప్ అని కూడా ఇతర సమీక్షకులు రాసారు. అయితే దుబాయ్ నుంచి ఉమైర్ అందించిన సమీక్ష `సాహో` ఓపెనింగులను పెంచడంలో సహకరించిందనడంలో సందేహం లేదు. అయితే పెద్ద స్టార్ల విషయంలో నెగెటివిటీ కంటే పాజిటివిటీని స్ప్రెడ్ చేసేందుకు ఉమైర్ ఇష్టపడతారని మరోసారి బహిర్గతమైంది. అతడు కింగ్ ఖాన్ `పఠాన్` కి 5 స్టార్ రేటింగ్ ఇవ్వడంతో అందరూ షాక్ తిన్నారు. ఈ విషయంలో కాస్త ఆలోచించి దొరక్కుండా జాగ్రత్త పడి ఉంటే బావుండేదని ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ చెవులు కొరుక్కుంటున్నారు!!