టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గారు తీసిన కొన్ని గోల్డెన్ సినిమాలు ఇప్పటికి చాలా పాపులర్ అంటే నమ్మి తీరాల్సిందే!. ఫ్యామిలీ ఎమోషన్స్ వంటి కథలు ఎక్కువగా సాగుతున్న రొటీన్ కాలంలో మిస్టరీ కథలను జేమ్స్ బాండ్ స్పస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీలను ఎంచుకున్నారు. సినిమా కథలో సక్సెస్ ఫార్ములాను పసిగట్టగలిగే ఆయన అతి కొద్దీ కాలంలోనే సూపర్ స్టార్ అనే బిరుదును తెచ్చుకున్నారు. ఇక 1967లో టాలీవుడ్ ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ కొత్త పాఠాలను నేర్పిన సినిమా అవేకళ్లు.
కృష్ణ గారు ఎంత ఇష్టంగా చేసిన ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. సీరియల్ కిల్లర్ చుట్టూ తిరిగే ఈ సినిమా కథ అప్పట్లో తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ఇక కృష్ణ స్పెషల్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యి హత్యలను చేసే కిల్లర్ ని చాలా తెలివిగా పట్టుకోవడం ఈ సినిమాలో హైలెట్. కాంచన గారు ఈ సినిమాలో కృష్ణ సరసన నటించారు. ఇక రాజనాల పద్మనాభం గుమ్మడి వంటి అగ్ర నటులు వారి స్టైల్ లో వినోదాన్ని అందించారు. అంతే కాకుండా మావూళ్ళో ఒక పడుచుంది అనే సాంగ్ కూడా ఎవర్ గ్రీన్ అని చెప్పాలి.
రీ రికార్డింగ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమాగా ప్రేక్షకుల మదిలో అవే కళ్లు మూవీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ "అవే కళ్ళు" విడుదలై నేటికి 50ఏళ్ళు అవుతోంది. 1967లో డిసెంబర్ 14వ తేదీన ఈ సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. కోలీవుడ్ మూవీ అదె కంగల్ అనే మూవీకి ఈ సినిమా రీమేక్. తమిళ్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు తీరులోకచందర్ తెలుగు సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు.