65వ జాతీయ అవార్డు విజేతలు

Update: 2018-04-13 09:44 GMT
 65వ జాతీయ అవార్డులు ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ అధ్యక్షతన వివిధ బాషల నుంచి ఎంపిక చేసిన సినిమాలు-నటీనటుల నుంచి ఉత్తమమైనవి తీసుకుని వీటిని ప్రకటించారు. తెలుగుకు సంబంధించి ఉత్తమ జాతీయ తెలుగు సినిమాగా ఘాజీ అవార్డు గెలుచుకోగా అత్యుత్తమ ప్రజాదరణ పొందిన ఎంటర్ టైన్మెంట్ మూవీగా బాహుబలి 2 నిలిచింది. పది మంది సభ్యులు ఉన్న జాతీయ అవార్డుల ప్యానెల్ ఈ ప్రక్రియ చేపట్టింది. కన్నడ దర్శకులు పి శేషాద్రి- స్క్రీన్ రైటర్ ఇంతియాజ్ హుస్సేన్-నటి గౌతమి తాడిమళ్ళ-గీత రచయిత మెహబూబ్ తదితరులు ఇందులో ఉన్నారు. శ్రీదేవి ఉత్తమ నటిగా మామ్ సినిమాకు కాని అవార్డు గెలుచుకోగా ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ పురస్కారానికి నటుడు వినోద్ ఖన్నాను ఎంపిక చేసారు. ఇక పూర్తి విజేతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి

ఉత్తమ తెలుగు చిత్రం – ఘాజీ (నిర్మాత : పివిపి)

ఉత్తమ హింది చిత్రం – న్యూటన్ (నిర్మాత : అమిత్ మసూర్ కర్)

ఉత్తమ కన్నడ చిత్రం – హెబ్బెట్టు రామక్క (నిర్మాత : పుట్ట రాజు)

ఉత్తమ తమిళ చిత్రం – టు లెట్ (నిర్మాత : ప్రేమా సెజియన్)

ఉత్తమ అస్సామీ చిత్రం – ఇషు (నిర్మాత : చిల్డ్రన్ ఫిలిం సొసైటీ)

ఉత్తమ బెంగాలీ చిత్రం – మయూరక్షి (నిర్మాత : ఫిర్దౌసుల్ హసన్)

ఉత్తమ మరాటి చిత్రం – కచ్చా లింబు (నిర్మాత : మందార్ భాస్కర్ )

ఉత్తమ తులు చిత్రం : పడ్డాయి (నిర్మాత : నిత్యానంద)

ఉత్తమ జసారి చిత్రం : సిన్జర్ (నిర్మాత : శిబు సుసీలన్)

ఉత్తమ లడఖి చిత్రం : వాకింగ్ విత్ ది విండ్ (నిర్మాత : మహేష్ మోహన్ )

ఉత్తమ ఒడియా చిత్రం- హలో ఆర్సి (నిర్మాత : సంబిత్ మొహంతి)

ఉత్తమ మలయాళ చిత్రం – తోండిముతాలుం ద్రిక్సాక్షియుం (నిర్మాత : సందీప్ సేనన్)

ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ – అబ్బాస్ ఆలి మొఘల్ (బాహుబలి 2 )

ఉత్తమ నృత్య దర్శకుడు – గణేష్ ఆచార్య (గోరి తు లాత్ మార్- టాయిలెట్ ఎక్ ప్రేమ కథ చిత్రానికి)

ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ – బాహుబలి 2

స్పెషల్ జ్యూరీ అవార్డు – నగర్కిర్తన్ (నిర్మాత : సని ఘోష్ రాయ్)

ఉత్తమ సంగీత దర్శకుడు – పాటలకు ఎఆర్ రెహమాన్ (కాట్రు వెలియిదై)

                                   బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎఆర్ రెహమాన్(మామ్)

ఉత్తమ స్క్రీన్ ప్లే : ఒరిజినల్ క్యాటగిరీ : సంజీవ్ పజూర్(తోండిముతాలుం ద్రిక్సాక్షియుం)

 ఆడాప్టెడ్ క్యాటగిరీ : జయరాజ్ (భయానకం)

సంభాషణలు: సంబిత్ మొహంతి(హలో ఆర్సి)

ఉత్తమ గీత రచయిత : జేఎం ప్రహ్లాద్ (ముతురత్న)

ఉత్తమ సినిమాటోగ్రఫి : నిఖిల్ ఎస్ ప్రవీణ్ (భయానకం)

ఉత్తమ గాయని : వాన్ (సాషా)

ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ : ఫహాద్ ఫాజిల్ (తోండిముతాలుం ద్రిక్సాక్షియుం)

ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్ : దివ్య దత్తా(ఇరాదా)

ఉత్తమ బాల నటుడు/నటి : భనితా దాస్ (విలేజ్ రాక్ స్టార్స్)

ఉత్తమ నటుడు : రిద్ధి సేన్ (నగర్కిర్తన్)

ఉత్తమ నటి: శ్రీదేవి(మామ్ )

ఉత్తమ దర్శకుడు: జయరాజ్ (భయానకం)

ఉత్తమ బాలల చిత్రం : మోర్క్యా(నిర్మాత : కళ్యాణ్ రాజ్మోగ్లీ పడల్ )

ఉత్తమ పర్యావరణ సందేశాత్మక చిత్రం : ఇరాదా (నిర్మాత : ఐఈఎల్ ఎల్ పి)

ఉత్తమ సామాజిక స్పృహ కలిగించిన చిత్రం : ఆలోరుక్కం(నిర్మాత: జాలీ లోలప్పన్)

జాతీయ సమైక్యత కింద నర్గీస్ దత్ అవార్డు : దప్ప (నిర్మాత: సుమతిలాల్ పోపట్ లాల్ షా)

ఉత్తమ ప్రజాదరణ పొందిన ఎంటర్ టైన్మెంట్ చిత్రం : బాహుబలి 2 (నిర్మాత: ప్రసాద్ దేవినేని)

ఉత్తమ తొలి చిత్ర దర్శకత్వం (ఇందిరా గాంధీ అవార్డు): పంపల్లీ (చిత్రం: సింజర్)

ఉత్తమ గాయకుడు : కేజే యేసుదాస్ (విశ్వాసపూర్వం మన్సూర్)

ఉత్తమ ఫీచర్ ఫిలిం : విలేజ్ రాక్ స్టార్స్ (దర్శకనిర్మాత: రీమా దాస్)

దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం : వినోద్ ఖన్నా

బెస్ట్ ఫిలిం క్రిటిక్ : గిరిధర్ ఝా

ఉత్తమ సినిమా పుస్తకం : బాబీ వాహెన్బం (మాట్మాగి మణిపూర్)

బెస్ట్ ఫిలిం రిపోర్టర్  : సునీల్ మిశ్రా

ఉత్తమ ఎడిటర్ : సంజీవ్ మోంగ & టెంజిన్ కుంచోక్ (చిత్రం : మృత్యు భోజ్- ది డెత్ ఫీస్ట్)

ఉత్తమ సౌండ్ రికార్దిస్ట్ –ఆన్ లొకేషన్ : సమర్థ్ మహాజన్ (ది అన్ రిజర్వ్డ్)

ఉత్తమ ఆడియోగ్రఫి : అవినాష్ సోనవనే (పవసచా నిబంధ)

                          : అప్పు ప్రభాకర్ ( ఐ టెస్ట్)

                          : ఆర్నాల్డ్ ఫెర్నాండేస్ (డాన్)

ఉత్తమ దర్శకుడు : నాగరాజ్ మంజులే (పవసచా నిబంధ)

ఉత్తమ కుటుంబ కథా చిత్రం : హ్యాపీ బర్త్ డే (నిర్మాత: మెద్ ప్రణవ్ బాబాసాహెబ్ పోవార్)

ఉత్తమ ఫిక్షన్ ఫిలిం : మయత్ ( నిర్మాత దర్శకుడు : డాక్టర్ సుయాష్ షిండే)

స్పెషల్ జ్యూరీ అవార్డు : ఏ వెరీ ఓల్డ్ మ్యాన్ విత్ ఎనార్మస్ విగ్స్ ( దర్శకుడు : ప్రతీక్ వాత్స్)

                             :మండే ( దర్శకుడు : అరుణ్ కె)

ఉత్తమ యానిమేషన్ సినిమాలు : ది ఫిష్ కర్రీ (నిర్మాత : మునిష్ తివారి)

                                          : ది బాస్కెట్ ( నిర్మాత: నీలిమ)

ఉత్తమ పరిశోధనాత్మక చిత్రం : 1984 వెన్ ది సన్ డిడ్ నాట్ రైజ్ ( నిర్మాత దర్శకులు టీనా కౌర్)

ఉత్తమ సాహసోపేత చిత్రం : లడఖ్ చలే రిచావాలా ( దర్శకులు : ఇంద్రాణి చక్రవర్తి)

ఉత్తమ విద్యావంతమైన చిత్రం : ది లిటిల్ గర్ల్ వీ వర్ అండ్ ది విమెన్ వీ ఆర్ (దర్శకులు : వైశాలి సూద్)

ఉత్తమ మొదటి చిత్ర దర్శకత్వం : పియా షా (చిత్రం : వాటర్ బేబీ )

ఉత్తమ కళలు/సంస్కృతి చిత్రం : గిరిజా ( దర్శకత్వం: దేబప్రియ అధికారి, సమన్వయ సర్కార్)

ఉత్తమ చారిత్రాత్మక చిత్రం : నాచి సే బాంచి (దర్శకత్వం : బిజు టోప్పో)

                                    స్వోర్డ్ అఫ్ లిబర్టీ ( దర్శకత్వం : షైనీ జాకోబ్ బెంజమిన్)

 ఇవి 65వ జాతీయ అవార్డుల కింద ప్రకటించిన జాబితా. తెలుగు సినిమాలకు సంబంధించి ఘాజీ - బాహుబలి 2 కు మాత్రమే గుర్తింపు దక్కాయి. బాహుబలి కి బెస్ట్ పాపులర్ ఫిలిం-బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ – బెస్ట్ యాక్షన్ అవార్డ్స్ దక్కడం పట్ల హర్షం వ్యక్తమవగా ఘాజీకి మరికొన్ని అవార్డులు దక్కాల్సింది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News