గతంలో సినిమా రిలీజ్ కు నెట రోజుల ముందు ప్రీమియర్స్ వేస్తూ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేలా ప్లాన్ చేసేవారు. అయితే అది క్రమ క్రమంగా తగ్గు ముఖం పట్టింది. పెళ్లి చూపులు, మెంటల్ మదిలో.. వంటి తదితర సినిమాల కోసం రిలీజ్ కు దాదాపు ఇరవై రోజుల ముందుగానే ప్రత్యేకంగా ఫ్రీ ప్రీమియర్ షోలు ఏర్పాటు చేసి ప్రేక్షకుల అభిప్రాయాలని తెలుసుకుని మౌత్ టాక్ తో సినిమాని రిలీజ్ చేశారు. సూపర్ హిట్ అనిపించుకున్నారు.
అయితే ఆ తరువాత ఈ సంప్రదాయానికి నిర్మాతలు గుడ్ బై చెప్పారు. రిలీజ్ కు ముందు సినిమాని ప్రేక్షకులకు చూపించడం రిస్క్ అనుకున్నారో ఏమోగానీ మొత్తానికి రిలీజ్ కు ముందు సినిమాని ప్రేక్షకులకు ప్రత్యేకంగా చూపించే పద్దతికి స్వస్తిపలికారు. అయితే ఇప్పడు కొత్త ఫార్ములాని అమల్లోకి తీసుకొచ్చారు. సినిమా రిలీజ్ కు ముందు పెయిడ్ ప్రీమియర్స్ ని ఏర్పాటు చేసి ప్రేక్షకుల స్పందనని తెలుసుకుంటూ సినిమాపై హైప్ ని క్రియేట్ చేస్తున్నారు.
డబ్బు రావడంతో పాటు ఫ్రీగా మౌత్ పబ్లిసిటీ వస్తుండటంతో ఈ పద్దతికి ఇప్పడు ఆదరణ లభిస్తోంది. తాజాగా అడివి శేష్ నటించిన 'మేజర్ 'మూవీ కోసం రిలీజ్ కు వారం ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ ని చిత్ర బృందం దేశ వ్యాప్తంగా వున్న ప్రధాన నగరాల్లో కండక్ట్ చేసింది.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ రియల్ స్టోరీ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ కి ప్రీమియర్స్ ఏర్పాటు చేసిన ప్రతీ చోట ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ మూవీ జూన్ 3న వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు ఇదే ఫార్ములాని కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన '777 చార్లీ' మూవీ కూడా ఫాలో అవుతోంది. డాగ్ సెంటిమెంట్ తో రూపొందించిన ఈ కన్నడ మూవీ పాన్ ఇండియా వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. జూన్ 10న విడుదల కానున్న ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హీరో రానా సమర్పణలో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇటీవలే టీమ్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. 'మేజర్' తరహాలోనే ఈ మూవీ ప్రీమియర్స్ ని ప్లాన్ చేశారు. జూన్ 2న ఢిల్లీ, అమృత్ సర్ లలో ఫస్ట్ షోని ప్లాన్ చేశారు.
ఆ తరువాత లక్నో, పూనె, త్రివేండ్రం, సోలాపూర్, చెన్నై, కోల్ కతా, మధురై, హైదరాబాద్, వైజాగ్ ఇలా 21 సిటీలలో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. డాగ్ సెంటిమెంట్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ ఇప్పటికే దేశ వ్యాప్తంగా మంచి బజ్ ని క్రియేట్ చేసింది. ఈ నమ్మకం కారణంగానే చిత్ర బృందం దేశ వ్యాప్తంగా ప్రీమియర్స్ ని ప్లాన్ చేయడం విశేషం.