నాన్నకు ప్రేమతో నిర్మాతకు జాక్ పాట్

Update: 2016-06-23 07:43 GMT
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో తొలిసారి రూ.50 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన సినిమా ‘నాన్నకు ప్రేమతో’. దాదాపు రూ.54 కోట్ల షేర్ వసూలు చేసిందీ సినిమా. అయినప్పటికీ ఈ సినిమాను హిట్ కేటగిరీలో వేయలేని పరిస్థితి. అందుక్కారణం.. దాని బడ్జెట్ రూ.50 కోట్ల పైనే ఉండటం. బిజినెస్ రూ.55 కోట్ల దాకా జరగడం. దీంతో పెట్టుబడి.. వసూళ్లు రెండు దాదాపుగా ఈక్వల్ అయ్యాయి. కొన్ని ఏరియాల్లో నష్టం కూడా వచ్చింది. అందుకే దీన్ని ‘ఎబోవ్ ఏవరేజ్’గా పరిగణించాల్సి వచ్చింది. ఐతే విడుదలైన ఐదు నెలల తర్వాత ఇప్పుడు ఆ సినిమా ‘హిట్’ కేటగిరిలో చేర్చే పరిణామం జరిగింది. ఈ సినిమాకు నిర్మాత పెట్టిన పెట్టుబడిలో రూ.8 కోట్లు వెనక్కి వచ్చాయి. అదెలా అంటే..

యూరోప్ లోని చాలా దేశాల్లో సినిమా షూటింగుల్ని ప్రోత్సహించేందుకు.. అక్కడ షూటింగుకి అయిన ఖర్చులో కొంత వెనక్కి ఇచ్చే ఆఫర్ ఉంది. యూకేలో సైతం ఇలాగే రిబేటు ఇస్తారు. ‘నాన్నకు ప్రేమతో’ సినిమా షూటింగ్ మెజారిటీ పార్ట్ లండన్లోనే చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్ అయ్యాక ఖర్చు వివరాలు బ్రిటన్ ప్రభుత్వానికి అప్పగించి వచ్చాడు నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్. ఆ వివరాల్ని వెరిఫై చేసి.. షూటింగుకి అయ్యిన మొత్తంగా వెనక్కివ్వాల్సిన మొత్తం లెక్కించగా అది రూ.8 కోట్లని తేలింది. ఆ మొత్తాన్ని ఇటీవలే ప్రసాద్ కు చెల్లించారట. దీంతో ఈ మొత్తాన్ని ఆయన లాభంగానే భావించాలి. శాటిలైట్ రైట్స్ కూడా కలుపుకుంటే ప్రసాద్ కు బాగానే మిగిలినట్లే అన్నమాట. ఇలాంటి ఆఫర్లు ఉన్నాయి కాబట్టి.. ఈ మధ్య తెలుగు సినిమాలు చాలా వరకు ఫారిన్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇంతకుముందు పాటల కోసం మాత్రమే విదేశాలకు వెళ్లేవాళ్లు. కానీ ఇప్పుడు సినిమాలు సినిమాలు ఫారిన్లోనే చుట్టేస్తున్నారు.
Tags:    

Similar News