80 మందిపై న‌టుడి వేధింపులు.. ముఖాన్ని దాచేసుకుని గిల్ట్ ఫీల‌య్యాడు!

Update: 2022-12-21 04:23 GMT
మీటూ ఉద్య‌మ ప‌ర్య‌వ‌సానంలో హాలీవుడ్ మాన్ స్ట‌ర్ గా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ ప్ర‌ముఖ న‌టుడు నిర్మాత హార్వే వీన్ స్టీన్ పై విచార‌ణ కొన‌సాగుతోంది. అత‌డు మొత్తం 80 మంది మ‌హిళ‌ల‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని ఫిర్యాదులు అందాయి.పెద్ద‌రికం అధికారం అనే వాటిని అడ్డు పెట్టుకుని ద‌శాబ్ధాల పాటు అత‌డు ఆడిన ఆట‌కు మీటూ వేదిక‌గా చెక్ పెట్టేందుకు ప‌లువురు న‌టీమ‌ణులు ముందుకు వ‌చ్చారు. వీళ్ల‌లో యాంజెలినా జోలీ- జెన్నిఫ‌ర్ ఐన్ స్టెయిన్- సాల్మా హ‌య‌క్ వంటి ప్ర‌ముఖ న‌టీమ‌ణులు ఉన్నారు. వీన్ స్టీన్ నేరాల‌కు ఇప్ప‌టికే 23 ఏళ్ల జైలు శిక్ష ప‌డింది. మ‌రో న‌లుగురు మ‌హిళ‌ల ఆరోప‌ణ‌ల‌పైనా ఇప్పుడు విచార‌ణ సాగుతోంది. ఈ కేసులో అత‌డికి అద‌నంగా మ‌రో సంవ‌త్స‌రం జైలులో గ‌డ‌పాల్సి ఉంటుంద‌ని తీర్పు వెలువ‌డింది.

ఒక నెల రోజుల విచారణ తొమ్మిది రోజుల చర్చల తరువాత లాస్ ఏంజిల్స్ న్యాయమూర్తులు సోమవారం తుది తీర్పు వెలువ‌రించారు. హార్వే వైన్ స్టీన్ పై అత్యాచారం లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు చేసిన‌ నలుగురు నిందితులలో ఒకరిపై నేరం జ‌రిగింద‌ని విచార‌ణ‌లో కనుగొన్నారు. కానీ విచారణలో జేన్ డో -1 అనే ఒక ఇటాలియన్ నటి మ‌రో మోడల్ స‌హా ఇద్ద‌రు ప్ర‌ముఖులు వీన్ స్టీన్ పై ఆరోపించారు. న్యూయార్క్ లో అత్యాచారం లైంగిక వేధింపుల నేరారోపణకు 23 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్న వైన్ స్టీన్ కాలిఫోర్నియా కోర్టు విచార‌ణ‌లో శిక్ష ప‌రిధిని 24 సంవత్సరాలకు పొడిగించారు. అతను 2013లో లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తన హోటల్ గదిలోకి పిలుపు లేకుండానే ప్ర‌వేశించాడని చెప్పిన మహిళపై అత్యాచారం స‌హా ఇత‌ర విధానాల‌లో వీన్ స్టెయిన్ లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు నిరూప‌ణ అయ్యింది.

హార్వే వైన్ స్టెయిన్ 2013లో ఆ రాత్రి నాలో కొంత భాగాన్ని నాశనం చేశాడు. నేను దానిని తిరిగి పొందలేను. క్రిమినల్ ట్రయల్ క్రూరమైనది. వైన్ స్టెయిన్ న్యాయవాదులు నాకు నరకం చూపించారు. కాని నేను చివరి వరకు పోరాడాను.. వైన్‌స్టీన్ తన జీవితకాలం జైలు గది వెలుపల చూడలేడని నేను ఆశిస్తున్నాను" అని స‌ద‌రు మ‌హిళ తీర్పు అనంత‌రం ఉద్వేగానికి గురైంది. 2010లో ఓ హోటల్ లో అతనికి చికిత్స అందించిన మసాజ్ థెరపిస్ట్ వైన్ స్టైన్ పై లైంగిక ఆరోపణలు చేశారు. అయితే దీని నుండి వైన్ స్టీన్ నిర్దోషిగా విడుదలయ్యాడు. దీనికి ఆధారాల్లేవ‌ని కోర్టు కేసును కొట్టి వేసింది.

కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ భార్య.. డాక్యుమెంటరీ ఫిలింమేక‌ర్ అయిన జెన్నిఫర్ సిబెల్ న్యూసోమ్ కు సంబంధించిన అత్యాచారం లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇద్దరు నిందితులకు సంబంధించిన గణనలపై జ్యూరీ నిర్ణయానికి రాలేకపోయింది. ఈ కేసులో ఆధారాలు నిరూప‌ణ కాలేదు. అయితే వైన్ స్టీన్ టేబుల్ వైపు చూస్తూ ప్రారంభ నేరాల‌ గణనల‌ను చదివేప్పుడు త‌న‌ ముఖాన్ని  చేతుల్లో దాచేసుకుని గిల్ట్ ఫీల‌య్యాడు. అత‌డు త‌న‌పై మిగిలిన తీర్పు  కోసం ఎదురు చూశాడు. న్యాయవాదులు కానీ డిఫెన్స్ న్యాయవాదులు కానీ ఈ తీర్పుపై తక్షణ వ్యాఖ్యలు చేయలేదు.

తాజా తీర్పు అనంత‌రం.. "హార్వే వైన్ స్టెయిన్ మరో మహిళపై అత్యాచారం చేయలేడు. అతను తన జీవితాంతం కటకటాల వెనుక గడుపుతాడు"అని సిబెల్ న్యూసోమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విచారణలో వైన్ స్టీన్ న్యాయవాదులు మమ్మల్ని భయపెట్టడానికి.. కించపరిచేందుకు..అపహాస్యం చేసేందుకు తెగించారు. సెక్సిజం- స్త్రీద్వేషం - బెదిరింపు వ్యూహాలను ఉపయోగించారు. సమాజంలో ఇలాంటి వారిని మనం ఎలా ఎదుర్కోవాలో ఈ విచారణ పూర్తిగా గుర్తు చేసింది... అని ఆమె వ్యాఖ్యానించారు.

సీబెల్ న్యూసోమ్ తీవ్రమైన వేధింపుల‌పై నాటకీయ సాక్ష్యం ఇవ్వ‌డంపై విచార‌ణ లోతుగా సాగింది. త‌న‌ను 2005లో హోటల్ గదిలో వైన్ స్టెయిన్  అత్యాచారం చేశాడ‌ని ఆమె ఆరోపించింది. విచారణలో అత్యంత నాటకీయ క్షణాలు ఉద్వేగాల అనంత‌రం.. 12 మంది న్యాయమూర్తులలో ఎనిమిది మంది చివ‌రికి ఆమె ఆరోప‌ణ‌లు నిజం అని నిర్ధారించారు. వైన్ స్టీన్ ను దోషిగా గుర్తించడానికి అంగీకరించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News