కొందరు స్టార్ హీరోలు అమెరికాలో ఇంకా మిలియన్ క్లబ్ టచ్ చేయడానికి కష్టపడుతున్నారు. అలాంటిది స్టార్ వాల్యూ లేని ఓ సినిమా ఏకంగా 2 మిలియన్ డాలర్ల క్లబ్బును దాటేసి సంచలనం సృష్టించింది. కేవలం 9 రోజుల్లోనే ‘అఆ’ 2 మిలియన్ క్లబ్బులోకి అడుగుపెట్టడం విశేషం.
8వ రోజు అత్తారింటికి దారేది (1.86 మిలియన్ డాలర్లు) రికార్డును దాటేసిన అఆ.. 9వ రోజు 2 మిలియన్ క్లబ్బులోకి చేరడమే కాక నాన్నకు ప్రేమతో (2.02 మిలియన్లు) కలెక్షన్లను కూడా దాటేసింది. అమెరికన్ బాక్సాఫీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమా ల్లో బాహుబలి ( 8.46 మిలియన్లు).. శ్రీమంతుడు (2.89 మిలియన్లు) మాత్రమే ‘అఆ కంటే ముందుండటం విశేషం. నితిన్ లాంటి హీరో సినిమా అమెరికాలో ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం మామూలు విషయం కాదు. ఇదంతా త్రివిక్రమ్ మ్యాజిక్కే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ వారం వచ్చిన రెండు సినిమాలకు టాక్ ఏమంత బాగా లేని నేపథ్యంలో ‘అఆ రెండో వారాంతంలో కూడా కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశముంది. రెండో వారం కూడా అమెరికాలో ఈ సినిమా దాదాపు వంద స్క్రీన్లలో ఆడుతుండటం విశేషం. ఫుల్ రన్లో ‘అఆ’.. శ్రీమంతుడు కలెక్షన్లను దాటేసినా ఆశ్చర్యం లేదు.