కబాలి రాకపోతే 'అ..ఆ' కోరిక తీరినట్లే

Update: 2016-07-11 15:30 GMT
బహుశా ఈ సీజన్లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ''కబాలి'' అనే చెప్పాలి. ఎందుకంటే సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ క్రేజ్ అలాంటిది మరి. యావత్ భారతదేశం అంతా ఈ డాన్‌ కథ ఎప్పుడు వెండితెర మీదన చూడొచ్చా అని ఎదురుచూస్తున్నారు. కాని కబాలి మాత్రం చక్కగా కాలక్షేపం చేస్తున్నాడు. అయితే కబాలి ఎంత లేటైతే.. ఒక తెలుగు సినిమాకు మాత్రం అంత ప్లస్.

నిజంగా 'కబాలి' సినిమా కనుక జూలై 1న రిలీజయ్యుంటే.. ఖచ్చితంగా ''అ..ఆ'' సినిమాకు ధియేటర్లు తగ్గేవి. ఒకవేళ 'ఒక మనసు' వంటి సినిమాలు పెద్ద హిట్టయినా కూడా ఆ ప్రభావం ఈ త్రివిక్రమ్ సినిమాపై ఖచ్చితంగా పడేదే. కాని అవన్నీ జరగకపోవడంతో.. ఇప్పుడు నితిన్ అండ్ సమంతల సినిమా హ్యాపీగా 50 కోట్ల షేర్‌ క్లబ్‌ లోనికి దూసుకుపోయింది. అంతే కాదు.. ఎలాగో కబాలి జూలై 15 తరువాతే రిలీజవుతోంది కాబట్టి.. ఇప్పుడు మెజార్టీ ధియేటర్లలో ఈ సినిమా 50 రోజులు దిశగా కూడా దూసుకుపోతోంది. ఇప్పటికే 40 రోజులు కంప్లీట్‌ చేసుకున్న ఈ లవ్లీ ఎంటర్టయినర్ అలా ఒకేసారి రెండు ఫీట్లు సాధించి.. నితిన్‌ కు మాంచి ఉపశమనం ఇచ్చింది.

ఈ మధ్యకాలంలో ఇలాంటి 50 రోజుల ఫీట్లనే చాలా గొప్పగా చెప్పుకోవాల్సి వస్తోంది. బహుశా ఎక్కువ ధియేటర్లలో ముందే రిలీజవ్వడం.. అలాగే ఇతర సినిమాల పోటీ కారణంగా రెండు వారాలకే సినిమాలను తీసేయాల్సి రావడంతో.. 50 రోజులు అంటేనే ఇప్పుడు ఒక 175 డేస్ లెక్క. అవ్ మల్ల!!
Tags:    

Similar News