త్రివిక్రమ్ చాలా రోజుల తర్వాత మనసుపెట్టి పాటలు తీసిన సినిమా ‘అఆ’. ఇందులో ప్రతి పాటకూ ఓ కాన్సెప్ట్ ఉంటుంది. ఎంతో కసరత్తు చేసి..ఆలోచించి పాటలు తీసిన సంగతి అర్థమవుతుంది. పాటలు కథతో పాటు ట్రావెల్ అవుతాయి తప్ప.. సిగరెట్ సాంగ్స్ లాగా అనిపించవు. అందుకే పాటలు వచ్చినపుడు జనాలు లేచి బయటికి వెళ్లిపోకుండా ఆసక్తిగా తెరకు కళ్లప్పగించేస్తున్నారు. సినిమాకు.. అందులోని పాటలకు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో.. త్రివిక్రమ్ ఎంతో ఇష్టపడి కష్టపడి తీసిన పాటలకు సంబంధించి మేకింగ్ వీడియోల్ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తోంది ‘అఆ’ టీమ్.
తాజాగా ‘అఆ’లోని టాప్ సాంగ్స్ లో ఒకటైన ‘రంగ్ దె’ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ పాట చిత్రీకరించిన తీరు ముచ్చటగొలిపేలా ఉంది. ఈ పాటలో తన నిశ్చితార్థానికి ఇంట్లో ఏర్పాట్లు జరుగుతుంటే సమంత మాత్రం అవేమీ పట్టనట్లు నితిన్ ను ఊహించుకుంటూ సంతోషంగా గెంతులేస్తూ పాట అందుకుంటుంది. ఈ సందర్భంలో అలా తిరుగుతూ తిరుగుతూ వచ్చి ఒక్క క్షణం ఆగుతుంది. ఆ మూమెంట్ ను మేకింగ్ వీడియోలో చూపించారు. సమంత అలా వచ్చి ఆగిన సందర్భంలో త్రివిక్రమ్.. ‘‘నాకు ఇక్కడ మెరిసిపోయే కళ్లు కావాలి’’ అనడం చూపించారు. ఇంకా ఈ పాట కంపోజ్ చేసిన మిక్కీ జే మేయర్.. రాసిన రామజోగయ్య శాస్త్రి డ్యాన్స్ కంపోజ్ చేసిన శోభి మాస్టర్.. కెమెరామన్ నటరాజన్ సుబ్రమణ్యంల బైట్స్ కూడా ఇచ్చారు. చాలా ట్యూన్లు రిజెక్ట్ అయ్యాక తొమ్మిదో ప్రయత్నంలో ఈ ట్యూన్ ఓకే అయిందని మిక్కీ చెప్పడం విశేషం.
Full View