కన్నడ ఇండస్ర్టీ నుంచి తెలుగు ఇండస్ర్టీలోఅడుగు పెట్టిన బ్యూటీ తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. అందం..అభినయం గల బ్యూటీగా మొదటి సినిమాతోనే ముద్ర వేసేసింది. ఆ తర్వాత వరుసగా అవకాశాలతో పాటు..చేసిన ప్రతీ సినిమా సక్సెస్ అవ్వడంతో అమ్మడు లక్కీ హీరోయిన్ గా వెలిగిపోయింది. దీంతో ఆ భామకి స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరడానికి పెద్దగా సమయం పట్టలేదు.
బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ ల నేపథ్యంలో ఆ స్థానం టాలీవుడ్ కట్టబెట్టింది. ఇక కెరీర్ పరంగా ఇంకా పీక్స్ చేరుకుంటుంది. ఇదే సమయంలో ప్రేమించిన ప్రియుడితో చేసుకున్న నిశ్చితార్ధం సైతం క్యాన్సిల్ అయింది. దీని వెనుక అమ్మడి హస్తమే ఉందని ప్రధానంగా హైలైట్ అయింది. ఎదిగే క్రమంలో పెళ్లి అడ్డంకిగా భావించి నిశ్చితార్ధం రద్దు చేయించుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
అయితే దీని వెనుక ఆ హీరోయిన్ మామ్ స్కెచ్ కూడా ఉందని అప్పట్లో వైరల్ అయింది. అందులో వాస్తవం ఎంతో తెలియదు గానీ..తాజాగా ఆ స్టార్ హీరోయిన్ కెరీర్ ఎదుగుదల చూసి తెగ మురిసిపోతుందట ఆ అందమైన మామ్. టాలీవుడ్ లో ఇంకా నటించాల్సిన స్టార్ హీరోలు కొందరున్నా...బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అటుగా దృష్టి నిలిపి కెరీర్ ప్లాన్ చేసుకుంటుంది.
ప్రస్తుతం హిందీలోనే మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇంకా అక్కడి జూనియర్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకూ అందరి చూపు ఆ బ్యూటీపైనే ఉంది. ఇదే అదునుగా ఆ బ్యూటీ ఇటీవల డ్రెస్సింగ్ సెన్స్ లో సైతం ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. బాలీవుడ్ ట్రెండ్ కి తగ్గట్టు నడుచుకుంటుంది. ఫ్యాషన్ ఎంపికల్లో బాలీవుడ్ ట్రెండ ఉండేలా చూసుకుంటుంది.
ఫంక్షన్ ఏదైనా విడిచిపెట్టడం లేదు. తప్పక అటెండెన్స్ ఉంటుంది అక్కడ. హిందీ భామలు అనుసరించే ప్రతీ విధాన్ని అమ్మడిప్పుడు ఫాలో అవుతుంది. కుదిరితే ఇంకా వాళ్లకన్నా అడ్వాన్స్ గా ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఈ రకంగా కుమార్తె ఎదుగుదలన చూసి ఆ తల్లి ఎంతో మెరిసిపోతుంది ట.
తాను హీరోయిన్ కాలేకపోయినా తన కుమార్తెని నేడు ఈ స్థాయిలో చూసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తోటి స్నేహితులతో చెప్పుకుని సంబడరపడుతోందిట. అంతేగా ! బిడ్డలు ఎదుగుదల కన్నా తల్లిదండ్రులన్నా కోరుకునేది ఇంకేముంటుంది? ఇక ఆ హీరోయిన్ తండ్రి కాఫీ ఎస్టేట్ బిజినెస్ లో దూసుకుపోతున్నాడు.
అయితే ఆ బ్యూటీకి ఈ స్థాయిలో గుర్తింపు రావడానికి కారణం టాలీవుడ్ అని అంతే గర్వంగా చెబుతుందిట. ముఖ్యంగా ఓ పాన్ ఇండియా సినిమా తన కెరీర్ ని టర్న్ చేసిందని..ఆ కారణంగానే హిందీ పరిశ్రమలో అవకాశాలు వస్తున్నాయని చెప్పుకుంటుందిట. ఆరకంగా టాలీవుడ్ ని అమ్మడు ఎంతగా గౌరవిస్తుందో అద్దం పడుతుంది.