దశాబ్ధ కాలం ఎదురుచూపులు.. ధమాకాతో దుమ్ములేపాడు..!

Update: 2023-01-06 00:30 GMT
యువ సంచలనం భీమ్స్ సెసిరోలియో ధమాకాకి ఇచ్చిన మ్యూజిక్ అంతటా ప్రశంసలు అందుకుంటుంది. మాస్ సినిమాకు కావాల్సిన మాంచి మాస్ బీట్ సాంగ్స్ ఇచ్చి థియేటర్ లో హుషారు తెప్పించేలా చేశాడు భీమ్స్. అయితే ధమాకా తో హిట్ అందుకున్న ఈ మ్యూజిక్ డైరెక్టర్ బయోగ్రఫీ ఒక లుక్కేస్తే అతనేదో నిన్న మొన్న వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కాదని తెలుస్తుంది. 2012లోనే నువ్వా నేనా సినిమాకు భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ డైరెక్షన్ చేశాడు. ఆ సినిమాలో సాంగ్స్ మాత్రమే ఇవ్వగా మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

అలా చిన్న సినిమాలకు భీమ్స్ తన మ్యూజిక్ అందిస్తూ వచ్చాడు. టాలెంట్ ఎక్కడ ఉంటే వారికి ఛాన్స్ ఇచ్చే రవితేజ భీమ్స్ ప్రతిభని గుర్తించి బెంగాల్ టైగర్ కి మ్యూజిక్ ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమాలో కూడా సాంగ్స్ హిట్ అయ్యాయి. ఇక మళ్లీ ఏడేళ్ల తర్వాత ధమాకాతో ఛాన్స్ అందుకున్నాడు భీమ్స్. ఈమధ్య కాలంలో స్టార్ సినిమా అంటే చాలు దేవి, థమన్ లను మార్చి మార్చి తీసుకుంటున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్స్ కొరత బాగా ఉన్న తెలుగు పరిశ్రమలో ఈ నవ యువ సంచలనం నమ్మకాన్ని కలిగిస్తున్నాడు. ధమాకా లాంటి మాస్ సినిమా ఈ రేంజ్ హిట్ అయ్యింది అంటే దానికి మెయిన్ హైలెట్స్ లో భీమ్స్ మ్యూజిక్ కూడా అని చెప్పొచ్చు. తనకు వచ్చిన ఛాన్స్ ని అన్ని విధాలుగా వాడేసుకున్నాడు భీమ్స్. ధమాకాలో జింతాక జింతాక, దండకడియాల్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. యూట్యూబ్ లో కూడా ఈ సాంగ్స్ దూసుకెళ్తున్నాయి.

భీమ్స్ ధమాకా లాంటి హిట్ కొట్టడానికి దశాబ్ధ కాలం పట్టింది. అయితే భీమ్స్ ఇదే విధంగా దూసుకెళ్తే మాత్రం స్టార్ ఛాన్స్ లు కూడా అందుకుంటాడని చెప్పొచ్చు. దేవి, తమన్ కాకుండా అనూప్ రూబెన్స్ కూడా తన సంగీతంతో అలరిస్తున్నా స్టార్ హీరోల రేంజ్ కి తగిన మ్యూజిక్ ఇవ్వడంలో వెనకపడ్డాడు. అందుకే కొత్తగా భీమ్స్ గురించి టాలీవుడ్ లో బిగ్ డిస్కషన్ నడుస్తుంది. ధమాకా తర్వాత కూడా భీమ్స్ ఇలాంటి ఒక మ్యూజిక్ హిట్ ఇస్తే మాత్రం తను నెక్స్ట్ లెవల్ కి వెళ్లినట్టే లెక్క.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News