రామ్ కు చెమటలుపట్టించిన అభిమాని

Update: 2017-02-21 16:48 GMT
తమ అభిమాన నటీనటుల విషయంలో అభిమానులు వ్యవహరించే తీరు చిత్ర విచిత్రంగా ఉంటాయి. అభిమానులు చేసే కొన్ని పనులతో సినీ ప్రముఖులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. దీనికి కాస్త భిన్నమైన అభిమానులు ఉంటారు. తమ అభిమాన నటులకు షాకులిస్తారు. వారి దెబ్బకు అభిమాన హీరోలు హడలిపోతుంటారు.

తాజాగా ఇలాంటి అనుభవమే ఎదురైంది యంగ్ హీరో రామ్ కు. ఆయన నటించిన సినిమా హైపర్ విడుదలై దాదాపుఐదు నెలలు కావొస్తోంది. ఇప్పటివరకూ రామ్ తన తర్వాతి సినిమాను ఇంతవరకూ ప్రకటించలేదు. ఈ తీరుకు రామ్అభిమాని ఒకరికి విపరీతమైన ఆవేదనను కలిగించింది. ఎందుకిలా అన్న ఆలోచనతో అతగాడు సరికొత్త రీతిలో రియాక్ట్ అయ్యాడు.

సోషల్ మీడియాలో రామ్ కు తన అభిమానాన్ని ప్రదర్శించిన సదరు అభిమాని (తరుణ్ సాయి ప్రకాష్) రామ్ కు ఊహించని ఝులక్ ఇచ్చారు. సినిమా విడుదలయ్యాక ఇంత గ్యాపా? అంటూ ప్రశ్నించటమే కాదు.. రామ్ కొత్త సినిమాకు సంబంధించిన వివరాల్ని విడుదల చేసే వరకూ తాను ఉపవాసం ఉంటానని.. అనౌన్స్ చేసిన తర్వాతే ఎంగిలిపడతానని హెచ్చరించాడు.

అభిమాని నుంచి ఈ తరహా ట్వీట్ ను ఎంతమాత్రం ఊహించని రామ్ వెనువెంటనే అభిమాని ట్వీట్ కు రియాక్ట్ అయ్యారు. ‘‘అలాంటి పనులు చేయొద్దు. నాకు లేనిపోని కొత్త టెన్షన్స్ ను తెచ్చి పెట్టొద్దు’’ అంటూ రిక్వెస్ట్ చేశాడు. తాను తన కొత్త సినిమా గురించి వెల్లడించే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా వెల్లడించారు. మరి..రామ్ ట్వీట్ కు సదరు అభిమాని ఎంతవరకు సంతృప్తి చెందుతారో మరి..?


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News