థియేట‌ర్ల కోసం భారీ యుద్ధం త‌ప్పేట్టు లేదే!

Update: 2022-11-12 16:30 GMT
కొన్నేళ్ల క్రితం డ‌బ్బింగ్ సినిమాల‌కు అత్య‌ధికంగా థియేట‌ర్లు కేటాయించిన స‌మ‌యంలో ర‌భ‌స జ‌రిగింది,. దీంతో టాలీవుడ్ లో పండ‌గ సీజ‌న్ ల‌లో సినిమాలు విడుద‌లైన‌ప్పుడు స్ట్రెయిట్ సినిమాల‌కు థియేట‌ర్లు కేటాయించాల‌ని, ఆ త‌రువాతే డ‌బ్బింగ్ సినిమాల‌కు కేటాయించాల‌నే ఒప్పందాన్ని నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు చేసుకున్నారు. దాన్ని ఖ‌చ్చితంగా పాటించాల‌ని కూడా అనుకున్నారు. ఈ విష‌యంలో ప్ర‌ధానంగా వాయిస్ ని వినిపించారు స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు.

వ‌రంగ‌ల్ శ్రీ‌ను డ‌బ్బింగ్ సినిమా కోసం థియేట‌ర్లు కావాల‌ని ప‌ట్టుబ‌ట్టిన నేప‌థ్యంలో ఈ చ‌ర్చ జ‌రిగింది. ముందు థియేట‌ర్ల విష‌యంలో స్ట్రెయిట్ సినిమాల‌కే ప్ర‌ధాన ప్రియారిటీ అని, ఆ త‌రువాత మిగిలితే డ‌బ్బింగ్ సినిమాల‌కు థియేట‌ర్ల‌ని కేటాయించాల‌ని ఓ మాట అనుకున్నారు. అయితే ఈ సంక్రాంతికి ఆ మాట‌ని తీసి స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజే గ‌ట్టుమీద పెడుతున్నాడ‌ని తెలుస్తోంది. ఈ సంక్రాంతికి దిల్ రాజు రెండు డ‌బ్బింగ్ సినిమాల‌ని తెలుగులో రిలీజ్ చేయ‌బోతున్నారు.

దిల్ రాజు త‌మిళ హీరో విజ‌య్ తో నిర్మిస్తున్న త‌మిళ చిత్రం `వారీసు`. వంశీ పైడిపల్లి తెర‌కెక్కిస్తున్నీఈ మూవీని తెలుగులో `వార‌సుడు` పేరుతో సంక్రాంతి రోజునే రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీతో పాటు దిల్ రాజు మ‌రో త‌మిళ సినిమాని కూడా దించేస్తున్నాడు. అదే త‌ల అజిత్ న‌టిస్తున్న `తునివు`. హెచ్ వినోద్ రూపొందిస్తున్న ఈమూవీని కూడా సంక్రాంతికే తెలుగు సినిమాల‌కు పోటీగా రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు.

ఇప్ప‌టికే ఈ రెండు సినిమాల కోసం నైజాంతో పాటు వైజాగ్ ఏరియాల్లో ప్ర‌ధాన థియేట‌ర్ల‌ని బ్లాక్ చేసేశాడ‌ట‌. ఇదిలా వుంటే ఈ సంక్రాంతికి తెలుగు సినిమాలు చిరు న‌టిస్తున్న‌ `వాల్తేరు వీర‌య్య‌`, బాల‌కృష్ణ చేస్తున్న `వీర సింహారెడ్డి` కూడా రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈ రెండు సినిమాల‌కు మించి దిల్ రాజు నైజాంలో `వారీసు`కు బ్లాక్ చేసేశాడ‌ట‌. ఇది టాలీవుడ్ లో థియేట‌ర్ల యుద్ధానికి తెర‌లేపేలా వుంద‌నే కామెంట్ లు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి.

ఎగ్జిబిట‌ర్లు మాత్రం తెలుగు సినిమాలైన `వీర సింహారెడ్డి`, వాల్తేరు వీర‌య్య‌` సినిమాలని ప్ర‌ద‌ర్శించ‌డానికి ఆస‌క్తిని చూపిస్తుంటే దిల్ రాజు మాత్రం తాను రిలీజ్ చేస్తున్న డ‌బ్బింగ్ సినిమాల‌కు థియేట‌ర్లు కేటాయించాల్సిందే అంటూ కండీష‌న్ లు పెడుతున్నార‌ట‌. కార‌ణం ఏంటంటే మైత్రీ వారు నిర్మిస్తున్న `వీర సింహారెడ్డి`, వాల్తేరు వీర‌య్య‌` సినిమాల ప్ర‌ద‌ర్శిన హ‌క్కులు ఎవ‌రికీ ఇవ్వ‌క‌కుండా మైత్రీ వారే రిలీజ్ చేస్తుండ‌టం వ‌ల్లే ఈ ప‌రిస్థితి క్రియేట్ అవుతోంద‌ని చెబుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News