సడన్ ఒక అమ్మాయి ఒక కేసు వేసింది. అర్జెంటుగా ఫేస్ బుక్ లేదా ఇతర డేటింగ్ వెబ్ సైట్లలో పేక్ ప్రొఫైల్స్ పెట్టేవారిపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలంటూ ఒక చట్టాన్ని తయారుచేయాలని ఆమె కోరుతూ ఒక పిటిషన్ ధాఖలు చేసింది. ఇంతకీ ఈ ఫేక్ ప్రొఫైల్స్ పై అమ్మడు ఉక్కుపాదం మోపడానికి కారణం ఏంటంటే.. పదండి చూద్దాం.
యానీ అనే ఒక విదేశీ మహిళ.. టిండర్ అనే వెబ్ సైట్లో యాంటోనీ అనే అబ్బాయితో డేటింగ్ చేయడం మొదలెట్టింది. ఈమె వయస్సు 44.. పైగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అవతల యాంటోనీ వయస్సు 20లలోనే ఉంది. కాకపోతే మనోడు కల్ హో నా హో సినిమాలోని హీరో సైఫ్ ఆలీ ఖాన్ ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టేశాడు. 14 నెలల పాటు నిజంగానే ఈ సైఫీ ఆలీ ఖాన్ రూపంలో ఉన్న యాంటోనీని డేటింగ్ చేసింది ఆ బంగారం. తరువాత ఫోటో ఉన్నది ఒక ఇండియన్ సినిమా హీరో అని తెలుసుకుని షాకైంది.
బ్రిటన్ లో జరిగిన ఈ యవ్వారంతో ఇప్పుడు జనాలు నవ్వుకుంటున్నారు కాని.. యానీ మాత్రం ఫేక్ ఫ్రొఫైల్ పెట్టినోళ్ళకి శిక్షలు పడాలంటూ లీగల్ పోరాటం చేస్తోంది. ఒక సినిమా హీరో ఫోటో పెట్టి తనను మోసం చేసినందుకు యాంటోనీ దగ్గర నుండి భారీ ఫైన్ వసూలు చేయాలంటోంది కూడా. చూద్దాం ఏమవుతుందో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/