పెద్ద దర్శకుడిపై 'స్త్రీ 2' ఎఫెక్ట్
ఇంతలోనే మరో ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్ చేసిన ప్రకటన ఆశ్చర్యపరిచింది. అతడు ఐత్ రాజ్ 2 తీస్తున్నామని ప్రకటించారు.
హారర్ థ్రిల్లర్ జానర్ నేటి ట్రెండ్ లో సురక్షితమైన ఫార్ములా. ఈ జానర్ లో వచ్చిన సినిమాలు వందల కోట్లు కొల్లగొట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవలే విడుదలై ఏకంగా 800 కోట్లు పైగా వసూలు చేసి స్త్రీ 2 పెద్ద షాకిచ్చింది. ఈ విజయం వెనక రకరకాల కారణాలు ఉన్నప్పటికీ.. హారర్ థ్రిల్లర్లతో ఆర్జించాలన్న తపన ఇప్పుడు మేకర్స్ లో ఎక్కువైంది. ఇప్పటికే పలువురు పేరున్న దర్శకనిర్మాతలు 'స్త్రీ 2' సక్సెస్ స్ఫూర్తితో పాన్ ఇండియా కలలతో హారర్ సినిమాలు తీసేందుకు సిద్ధమవుతున్నారని కథనాలొచ్చాయి.
ఇంతలోనే మరో ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్ చేసిన ప్రకటన ఆశ్చర్యపరిచింది. అతడు ఐత్ రాజ్ 2 తీస్తున్నామని ప్రకటించారు. ఇది హారర్ థ్రిల్లర్ జానర్ లో వచ్చి విజయం సాధించిన 'ఐత్ రాజ్'కి సీక్వెల్. అయితే మొదటి భాగంలో నటించిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో నటించదని ఘాయ్ తెలిపారు. కొత్త సినిమాని కొత్త కుర్రాళ్లతో తీస్తున్నామని తెలిపారు. సీక్వెల్ థీమ్ ని రీరైట్ చేస్తున్నామని, నేటి ట్రెండ్ కి తగ్గట్టు ఎరోటిక్ థ్రిల్లర్ ని రూపొందిస్తామని సుభాష్ ఘయ్ చెబుతున్నారు. దీనికోసం ఓ మైగాడ్ 2 దర్శకుడు అమిత్ రాయ్‌తో ఘయ్ చేతులు కలిపాడు. నేటి సమకాలీన హీరోలతో కొత్త వెర్షన్‌ను రూపొందిస్తామన్నారు.
ఈసారి బోల్డ్ కాన్సెప్ట్ తో ఏరోటిక్ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమాని రూపొందిస్తామని నేటి తరానికి కనెక్టవుతుందని తెలిపారు. తుంబాద్, స్త్రీ వంటి సామాజిక స్పృహతో కూడిన హారర్ జానర్ చిత్రాలు పెరుగుతున్నాయని కూడా విశ్లేషించారు. ఐత్ రాజ్ 2 హర్రర్ జానర్ లో కొత్త ఎలిమెంట్స్ తో ఊహించని విధంగా ఉంటుందని హామీ ఇచ్చారు. అయితే ప్రియాంక చోప్రా లాంటి గ్లోబల్ స్టార్ తో సినిమా తీయాలంటే లోకల్ డైరెక్టర్లకు అంత సులువు కాదు. పీసీ ఇప్పటికే పాన్ వరల్డ్ స్టార్. అందువల్ల పారితోషికం పెద్ద రేంజులో చెల్లించాల్సి ఉంటుంది.