ఎ-లిస్ట్ హీరోలు రాజీ (కాంప్రమైజ్) పడాలని కోరినట్టు మల్లికా శెరావత్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మరోసారి బాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ ను బహిర్గతం చేసిన ఇతర నటీమణుల గురించి చర్చ సాగుతోంది. మల్లికా షెరావత్ కంటే ముందే ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేసిన కథానాయికల జాబితాలో కంగనా రనౌత్ నుండి రాధికా ఆప్టే వరకు చాలా మంది బాలీవుడ్ నటీమణులు తమకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను మీడియాకి షేర్ చేసారు.
కాస్టింగ్ కౌచ్ భయాందోళనల గురించి ఓపెనైన నటీమణులంతా బాలీవుడ్ లో ఈ వేధింపుల ప్రహసనం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోందని వెల్లడించారు. చాలా మంది నటీమణులు తమ జీవితంలో కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నప్పుడు భయానక మైన సంఘటనలను ఎదుర్కొన్నారు. ఎవరు ఏ సందర్భంలో వేధింపుల గురించి ప్రస్థావించారు? అన్నది పరిశీలిస్తే..
బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి జాతీయ అవార్డు గ్రహీత నటి కంగనా రనౌత్ ఒక వార్తా ఛానెల్ తో మాట్లాడుతూ "మెయిన్ యే నహీ కెహ్తీ కే మెయిన్ సబ్ కో జనరలైజ్ కరి హు" అని అన్నారు. మెయిన్ జిస్కో మిలీ హు.. ఎ లిస్ట్.. బి లిస్ట్.. బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్.. అంతా కోరుకున్నది ఒకటే.. సెట్స్‌లో భార్యలా ప్రవర్తించాలనేది అమ్మాయి నుండి వారంతా ఆశించారు. నెక్స్ట్ చిత్రం వస్తుంది.. తదుపరి హీరో వస్తాడు. మళ్లీ అదే కోరతాడు.. ఇదీ ఇండస్ట్రీ నిజం.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.తనకు ఎదురైన అనుభవాలను కంగన చాలా సార్లు బహిరంగంగా ప్రకటించింది. ఇందులో ఒక గ్రీక్ గాడ్ గా పిలుచుకునే అగ్ర హీరో సహా పలువురు ఎ-లిస్టర్ల పేర్లు ఉన్నాయి. కంగన ప్రతిసారీ ఎటాక్ చేసే అగ్ర దర్శకనిర్మాత పేరు కూడా ఈ జాబితాలో ఉంది.
రక్త చరిత్ర- కబాలి చిత్రాల్లో నటించిన రాధిక ఆప్టే తనకు బాలీవుడ్ లో ఎదురైన ఎన్నో వేధింపుల అనుభవాల గురించి బహిరంగంగా వెల్లడించారు. తనను ఒక సౌత్ అగ్ర నటుడు తన రూమ్ ఫోన్ కి కాల్ చేసి సరసాలాడేందుకు ప్రయత్నించాడని చెప్పింది. ఆమెకు కాల్ వచ్చినప్పటి ఒక సంఘటనను గుర్తుచేసుకుంది. "వారు ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో చేస్తున్నారు.. నన్ను వారితో సమావేశం కావాలని నేను కోరుకుంటున్నాను. అయితే నేను ఆ వ్యక్తితో పడుకుంటే బాగుంటుందా?" అంటూ నవ్వుతూ సదరు ప్రముఖ హీరోని స్వర్గానికి బదులుగా నరకానికి పోతావంటూ శపించింది.
బాలీవుడ్ నటి చిత్రాంగదా సింగ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని స్పాట్ బాయ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. తన మోడలింగ్ రోజుల నుండి బాలీవుడ్ లో ఎదిగేంత వరకు ప్రతిచోటా ఇలాంటి వ్యక్తులు ఉన్నారని ఈ హాటీ చెప్పింది. వేధింపులు ఉన్న బాలీవుడ్ పరిశ్రమలోనే నటీమణులను ఎవరైనా బలవంతం చేసే చోటుకాదని ప్రతి ఒక్కరినీ వారి ఎంపికలను గౌరవించేంత స్పేస్ కూడా ఉందని ఆమె అన్నారు. బాలీవుడ్ లో రెండు కోణాల గురించి చిత్రాంగద బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడారు ఆ ఇంటర్వ్యూలో.
'తారే జమీర్ పార్' స్టార్ టిస్కా చోప్రా ఒక దర్శకుడితో అంతగా బయటపడని కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెనైంది. మీకు ఇది తెలుసా..? అతని(దర్శకుడి)తో సినిమా చేయడానికి అంగీకరించడం అంటే షూట్ వ్యవధిలో తన పెంపుడు స్క్వీజ్ (తన వెంటే పప్పీలా ఉండాలి)గా ఉండటానికి అంగీకరించినట్లు... అలా ఉంటే మనం బావున్నట్టేనా? అని ప్రశ్నించింది టిస్కా.
దక్షిణాదిలో తాను కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నట్లు సుర్వీన్ చావ్లా పేర్కొంది. ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో సుర్వీన్ మాట్లాడుతూ ఒక ప్రముఖ దర్శకుడితో కలిసి విశ్రాంతి తీసుకోవాలని కోరారు. ఆ సమయంలో అతను తనతో "నేను మీ శరీరంలోని ప్రతి అంగుళం ఎలా ఉంటుందో చూసి తెలుసుకోవాలనుకుంటున్నాను" అని అన్నాడట. సుర్వీన్ చావ్లా తెలుగు సినిమాలు సహా బాలీవుడ్ లో కూడా నటించింది. కొన్నిసార్లు వేధింపులను ఎదుర్కొన్నానని తెలిపింది. నానా పటేకర్ లాంటి అగ్ర నటుడు తనను వేధించాడంటూ ప్రముఖ కథానాయిక తనూశ్రీ దత్తా ఆరోపించిన అనంతరం దీనిపై విచారణ సాగిన సంగతి తెలిసిందే. చివరికి నానా నిర్ధోషిగా బయటపడ్డారు. ప్రముఖ గాయని చిన్మయిని తమిళ సీనియర్ లిరిసిస్ట్ వైరముత్తు వేధింపులకు గురి చేసిన ఘటనపైనా ఇంతకుముందు విచారణ సాగిన సంగతి తెలిసిందే.
కేవలం ఇలాంటి కొందరు కథానాయికలు గాయనీమణులు మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో మెజారిటీ భాగం తారలు కాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొన్నవారే. కానీ బయటికి తెలిసేవి కొన్ని మాత్రమే. మీ టూ ఉద్యమంలో భాగంగా ఇంతకుముందు ఆర్భాటంగా సోషల్ మీడియాల్లో ఇలాంటివి వెల్లడించేందుకు చాలామంది కథానాయికలు ముందుకు వచ్చారు.