స్టార్ హీరో బ్లాక్ బస్టర్ సినిమాలకు కొత్త మార్కెట్ క్రియేట్ అవుతోందా? అంటే ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన `పోకిరి` సినిమా నిజమేనని తేల్చింది. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా `పోకిరి`ని 4లోకి రీ మాస్టర్ చేసి భారీ స్థాయిలో విడుదల చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నై, యుఎస్ ఏ లలో భారీగా 375 షోలు వేశారు. దీంతో కోటికి పైగానే ఆదాయం వచ్చింది. ఇది ఇప్పుడు ఓ రికార్డుగా నిలిచింది.
`పోకిరి` చేసిన రచ్చ కారణంగా స్టార్ హీరోల అభిమానులు కూడా తమ హీరోలకు సంబంధించిన బ్లాక్ బస్టర్ ఎవర్ గ్రీన్ హిట్ మూవీస్ ని 4కె లోకి రీ మాస్టర్ చేసి పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే `పోరికి` డిమాండ్ తో పవన్ కల్యాణ్ అభిమానులు `జల్సా`ని 4కెలోని మార్పించి విడుదల చేయించారు. 500కు పైగా థియేటర్లలో ఈ మూవీని ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నై.. యుఎస్ ఏలలో భారీ స్థాయిలో రీ రిలీజ్ చేశారు.
సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఒక రోజు ముందుగానే `జల్సా` 4కె ప్రింట్ తో థియేటర్లలో హంగామా మొదలు పెట్టారు. సెప్టెంబర్ 2 న `జల్సా` ప్రత్యేక ప్రివ్యూ థియేటర్ల వద్ద అభిమానులు అల్లరి భారీ స్థాయిలో వుండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఈ మూవీ రికార్డు సృష్టించడం ఖాయం అని చెబుతున్నారు.
ఇదిలా వుంటే మహేష్, పవన్ అభిమానుల తరహాలోనే ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి తదితర హీరోల ఫ్యాన్స్ కూడా 4కే ప్రింట్స్ కోసం సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికే ప్రభాస్ `బిల్లా` మూవీని 4కెలోకి మార్చి విడుదల చేయాలనే డిమాండ్ లు పెరుగుతున్నాయి. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు జరగనున్న నేపథ్యంలో మేకర్స్ `బిల్లా`ని 4 కె లోరి రీమాస్టర్ చేస్తున్నారట.
ఇదిలా వుంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారట. ఇటీవలే ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా `ఆది` మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించారు. అయితే దీన్ని 4 కెలోకి రీమాస్టర్ చేసి మహేష్ `పోకిరి`, పవన్ `జల్సా`లా రిలీజ్ చేసి వుంటే బాగుండేదని, ఆ ఫీల్ ని మిస్సయ్యామని ఫీలవుతున్నారట. 4కె రీమాస్టర్ ప్రింట్ ల కారణంగా డిస్ట్రిబ్యూటర్లకు కొత్త బిజినెస్ మొదలైందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఒక్కో షోకు ప్రింట్ కోసం డిస్ట్రిబ్యూటర్ కు రూ. 30 వేలు ఇస్తున్నారట.
ఈ సమయంలో ఎప్పుడో బ్లాక్ బస్టర్ అయిన సినిమాకు ఇప్పడు రూ. 30 వేలు రావడం సదరు డిస్ట్రిబ్యూటర్లకు సిరకొత్త బిజినెస్ ని ఇచ్చినట్టేనని అంటున్నారు. తాజాగా మొదలైన 4కె ప్రింట్ ల హంగామాతో స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలకు కొత్త మార్కెట్ క్రియేట్ అయ్యిందన్నమాట. దీని వల్ల డిస్ట్రిబ్యూటర్లకు డబ్బు వస్తోంది. నిర్మాత కూడా ఎంతో కొంత సొంతం చేసుకుంటున్నాడు. భవిష్యత్తులో ఇది ట్రెండ్ గా మారడం ఖాయంగా కనిపిస్తోందని ఇన్ సైడ్ టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.