సినీ ప్రపంచంలో ఎప్పటికీ నిలిచి పోయే సినిమాలు కొన్ని ఉంటాయి. అందులో అవతార్ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమా వచ్చి దశాబ్దం దాటినా కూడా ఇంకా ఆ సినిమా టీవీలో టెలికాస్ట్ అవుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా అవతార్ అభిమానులు టీవీల ముందు కూర్చుంటారు. అంతటి విజయాన్ని సొంతం చేసుకున్న అవతార్ కి బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్ రాబోతున్నాయి.
దాదాపుగా అయిదు ఆరు సంవత్సరాల నుండి అవతార్ సీక్వెల్స్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అవతార్ 2 ని ఈ ఏడాది డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. అవతార్ అభిమానులు రోజులు లెక్క పెడుతూ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. హైదరాబాద్ సినీ ప్రేమికులకు అవతార్ ను అద్భుతంగా చూపించేందుకు ప్రసాద్ ఐమాక్స్ ఏర్పాట్లు చేస్తోందట.
ఒకప్పుడు అతి పెద్ద స్క్రీన్ ప్రసాద్ ఐమాక్స్ యొక్క సొంతం. కానీ ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్స్ ని మించిన స్క్రీన్స్ చాలానే వచ్చాయి. అలాగే అత్యాధునిక టెక్నాలజీ మల్టీ ప్లెక్స్ రంగం లో దూసుకు వచ్చాయి. ఆ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు ప్రసాద్ ఐమాక్స్ ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటూనే ఉంది.
మరో వంద రోజుల్లో అవతార్ 2 సినిమా రాబోతుంది. ఆ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అద్భుతంగా చూపించేందుకు గాను ప్రసాద్ ఐమాక్స్ వారు సరికొత్త హంగులను ఏర్పర్చుతున్నారని సమాచారం అందుతోంది. స్క్రీన్ డ్యూయల్ మరియు 4 కే ప్రొజెక్షన్ అంతే కాకుండా డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ను సరికొత్తగా ప్రసాద్ ఐమాక్స్ బిగ్ స్క్రీన్ లో అమర్చబోతున్నారట.
ఈ సరికొత్త హంగులు ప్రసాద్ ఐమాక్స్ లో చేయడం ద్వారా అవతార్ 2 ని అద్భుతంగా చూసే అవకాశం ఉంటుందని సినీ ప్రేమికులు భావిస్తున్నారు. త్వరలో ప్రారంభించబోతున్న ఈ రెనోవేషన్ పనుల కారణంగా బిగ్ స్క్రీన్ కి సంబంధించిన ప్రదర్శణలు కొన్నాళ్ల పాటు నిలిపి వేయబోతున్నారట.
ప్రసాద్ ఐమాక్స్ లో అవతార్ 2ని చూసేందుకు ఇతర ప్రాంతాల నుండి కూడా జనాలు వచ్చేలా అద్భుతమైన టెక్నాలజీ తో సరికొత్త హంగులు దిద్దుతున్నట్లుగా నిర్వాహకుల నుండి సమాచారం అందుతోంది. అవతార్ అంటేనే ఒక అధ్బుతం.. అలాంటిది ప్రసాద్ ఐమాక్స్ లోని బిగ్ స్క్రీన్ లో దాన్ని చూడటం ఒక అద్భుతం అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.