కరోనా తరువాత పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. నిర్మాణ వ్యయం పెరిగింది. ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది. టికెట్ రేట్లు పెరగడం, ఓటీటీల ప్రభావం కారణంగా గత కొంత కాలంగా పెట్టిన పెట్టుబడికి వస్తున్న రాబడికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. దీంతో చాలా వరకు నిర్మాతలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించాలంటే కొన్ని రోజుల వరకు షూటింగ్ ల బంద్ పాటించడమే ఏకైక మార్గం అని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక నిర్ణయానికి వచ్చాయి.
అ నిర్ణయం కారణంగా ఆగస్టు 1 నుంచి షూటింగ్ ల బంద్ ని పాటించాలని తీర్మానించుకున్నాయి. నిర్మాణంలో వున్న సినిమాలతో పాటు నిర్మాణం ప్రారంభం కావాలసిన సినిమాలు కూడా షూటింగ్ లని నిరవధింగా వాయిదా వేసుకోవాలని నిర్మాతలంతా ఓ మాట అనుకున్నారు. అదే పాటించాలని షూటింగ్ బంద్ ప్రకటించారు. అయితే ముందు నుంచి బంద్ విషయంలో ప్రధాన భూమిక పోషిస్తూ వచ్చిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తాను తమిళ హీరో విజయ్ తో నిర్మిస్తున్న సినిమా ఇప్పడు ప్రధాన చర్చగా మారింది.
ఆగస్టు1 నుంచి షూటింగ్ ల బంద్ అని ప్రకటించినా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న `వారీసు` మూవీకి సంబంధించిన షూటింగ్ ని వైజాగ్ లో చేస్తున్నారు. ఇదే ఇప్పడు షూటింగ్ ల బంద్ కు ప్రధాన ట్విస్ట్ గా మారింది. షూటింగ్ లు బంద్ అంటూ అన్ని సినిమాల షూటింగ్ లని నిలిపివేసి దిల్ రాజు సినిమా షూటింగ్ ని మాత్రం కంటిన్యూ చేయడం ఏంటన్న ప్రశ్న మొదలైంది. ఈ సినిమా తెలుగులో `వారసుడు` గా విడుదల కానుంది.
అయితే దీనిపై దిల్ రాజు వివరణ ఇచ్చారు. నా సినిమా షూటింగ్ జరుగుతోంది తమిళంలో. తెలుగులో కాదు. పైగా ఇది తమిళ సినిమా. తెలుగు సినిమాలు మాత్రమే షూటింగ్ బంద్ ని పాటిస్తున్నాయి. నేను ఎటువంటి తెలుగు సినిమా షూటింగ్ లు చేయడం లేదు అంటూ వివరణ ఇచ్చారు. ఇదిలా వుంటే ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని సోమవారం నుంచి షూటింగ్ లు నిలిపివేయమని ఫిల్మ్ ఛాంబర్ నుంచి మాకు ఎటువంటి లెటర్ ని పంపించలేదని ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. అంటే అతని ప్రకటన ప్రకారం షూటింగ్ లు ఆగిపోలేదని స్పష్టం అవుతోంది.
ఈ నేపథ్యంలో నిర్మాతలు షూటింగ్ ల బంద్ విషయంలో తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలుస్తోంది. తెలుగు సినిమా షూటింగ్ లు మాత్రమే బంద్ చేయాలా? లేక తెలుగు నిర్మాతలు తాము నిర్మిస్తున్న సినిమాల షూటింగ్ లు నిలిపివేయాలా? అంటే ఇతర భాషల్లో నిర్మిస్తున్న సినిమాలని కూడా నిలిపివేయాలా? ..వేరే భాషలో తెలుగు నిర్మాతలు నిర్మించే సినిమాలు అనువాదం చేసి తెలుగులోనే విడుదల చేస్తారు కదా మరి వాటి పరిస్థితి ఏంటీ? అని కొంత మంది నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
దీంతో చాలా మంది నిర్మాతలు షూటింగ్ ల బంద్ విషయంలో ఏటూ తేల్చుకోలేకపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి `వారీసు` షూటింగ్ ల బంద్ కు పెద్ద ట్విస్టే ఇచ్చిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు తమిళ సినిమా షూటింగ్ ని కూడా నిలిపివేయాలంటారా? లేదా కంటిన్యూ చేసుకోమంటారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా