సెలబ్రిటీల రాయల్ లుక్ ఎందులో ఎక్కువ ఎలివేట్ అవుతుంది? అంటే ఒకటి వారి డ్రెస్సింగ్ సెన్స్.. అలాగే వారు ఉపయోగించే వాహనం. బయట తిరిగేప్పుడు ముఖ్యంగా వారు వినియోగించే లగ్జరీ కార్ ఏదీ? అన్నది జనం పరిశీలిస్తారు. యూత్ లో అది హాట్ టాపిక్ గా మారుతుంది. ఆ రకంగా చూస్తే టాలీవుడ్ బాలీవుడ్ స్టార్లకు సొంత గ్యారేజీల్లో ఖరీదైన విదేశీ కార్లు ఎన్నో ఉన్నా వీటిలో ఇటీవల చేరిన కొత్త కార్ ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రభాస్ .. ఎన్టీఆర్ కొనుక్కున్న లంబోర్ఘినిని మించి ఇప్పుడు ఈ కొత్త కార్ ప్రముఖంగా చర్చల్లోకొస్తోంది.
ఇది మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ GLS ఆటోమేటిక్ పెట్రోల్ కార్. GLS 600 అనేది మెర్సిడెస్-మేబాచ్ బ్రాండ్ లేబుల్ నుండి వచ్చిన మొదటి SUV కార్. దీని ఖరీదు దాదాపు 3 కోట్లు. ఈ ఖరీదైన లగ్జరీ వర్షన్ కార్ ని చాలా మంది తీసుకున్నారు. కారు దాని ఏరోడైనమిక్ ఫీచర్స్.. భారీ డిజైన్ తో పాటు మేబాచ్ స్టైల్డ్ ఫ్రంట్ గ్రిల్ .. లైట్ ల రూపంలో రోడ్డుపై రాయల్ ఆ కనిపిస్తుంది. మొదట ఈ కార్ ముంబై రోడ్లపై చిద్విలాసంగా కనిపించింది. ఆ తర్వాత కోల్ కత.. చెన్నయ్ .. హైదరాబాద్ మెట్రోల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది.
బాలీవుడ్ లో అర్జున్ కపూర్ ఈ మేబాక్ ను మొదట కొనుగోలు చేయగా రణవీర్ సింగ్... కృతి సనన్ కూడా ముంబైలో డెలివరీ తీసుకున్నారు. భారతదేశంలో ప్రారంభించిన మేబ్యాచ్ యూనిట్ల మొదటి 60 వరకూ కార్లను కేవలం సినిమా తారలే బుక్ చేసుకున్నారట. ఇటీవల సాయి తేజ్ ని అపోలోలో విజిట్ చేసేందుకు చరణ్ - ఉపాసన ఇదే బెంజ్ మేబాక్ కార్ లో వెళ్లడం కంట పడింది. ఇక టాలీవుడ్ లో పలువురు టాప్ సెలబ్రిటీల కన్ను ఈ కార్ పై ఉందట. మరో వైపు.. ఇండస్ట్రియలిస్టులు .. వ్యాపారవేత్తల వద్ద ఈ తరహా లగ్జరీ మేబాక్ కార్ కొనుగోళ్లకు ఆర్డర్ చేస్తున్నారట.
రోల్స్ రాయిస్ నుంచి లంబోర్ఘిణి వరకూ..!
టాలీవుడ్ హీరోల్లో రోల్స్ రాయిస్ ఒకప్పుడు ట్రెండ్... ఆ తరువాత అది కాస్త రేంజ్ రోవర్ కి మారింది. ప్రస్తుతం మహేశ్- బన్నీ- రామ్ చరణ్ ఇలా చాలా మంది స్టార్ హీరోలు రేంజ్ రోవర్ వాడుతున్నారు. అది కాస్తా ఇప్పుడు లాంబోర్ఘిణికి షిఫ్టవుతోంది. రెండు నెలల క్రితం ప్రభాస్ లాంబోర్ఘిణి కార్ ని సొంతం చేసుకున్నారు. దానిపై తన సోదరీమణులు రైడ్ కి వెళ్లిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇటీవల జూనియర్ యన్టీఆర్ కూడా ఈ క్లబ్ లో చేరారు. ఇండియాలోనే మొట్టమొదటి లాంబోర్ఘిణి గ్రాఫైట్ ఎడిషన్ కారుని యన్టీఆర్ సొంతం చేసుకోవడం విశేషం.
భారతదేశపు మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కార్ జూనియర్ ఎన్టీఆర్ గ్యారేజ్ లో చేరింది. నిజానికి ఎన్టీఆర్ గ్యారేజీలో ఇప్పటికే బోలెడన్ని హై ఎండ్ కార్లు ఉన్నా.. లంబోర్ఘిణి ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణ గా మారింది. ఖరీదైన కార్లపై తారక్ ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటారు. ఇప్పుడు ప్రతిష్ఠాత్మకంగా లంబోర్ఘిణిని సొంతం చేసుకున్నాడు. ఇక రామ్ చరణ్ కి ఖరీదైన ఆస్టన్ మార్టిన్ కార్ ఉంది.
ఇంతకీ ఈ లంబోర్ఘిణి ఉరుస్ కార్ ప్రత్యేకత ఏమిటి? అంటే.. ఇది అరోన్సియో అర్గోస్ తో కాంట్రాస్ట్ కలర్ తో నీరో నోక్టిస్ మాట్ బ్లాక్ కలర్ తో డిజైన్ చేసినది. ఇది యూనిక్ కలర్ కాంబినేషన్ తో రోడ్లపై హెడ్ టర్నర్ గా నిలుస్తుంది. హై స్పీడ్ హై ఎండ్ టెక్నాలజీతో డిజైన్ చేయబడినది. తారక్ కార్ కి సంబంధించిన ఫోటోలను బెంగళూరుకు చెందిన ఆటో మొబిలియార్డెంట్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ కబురు తారక్ అభిమానులకు చేరడంతో సంబరాలు చేసుకుంటున్నారు.
నిజానికి ఇంతకుముందే లంబోర్ఘిణి తారక్ ఇంటికి చేరుకుందని ఆ కార్ లో చరణ్ ఇంటికి వెళ్లాడని కూడా ప్రచారమైంది. కానీ దానిని తారక్ సన్నిహితులు ఖండించారు. లంబోర్ఘిణి కోసం తారక్ ఏడాది కాలంగా అడ్వాన్స్ ఇచ్చి వేచి చూడగా ఇటీవలే అతడి ఇంటికి చేరింది.
ప్రస్తుతానికి లంబోర్ఘిణి ట్రెండ్ కొనసాగుతుండగానే ఇప్పుడు బెంజ్ మేబాక్ లో హైక్లాస్ కార్ ట్రెండింగ్ గా మారింది. ఆ తర్వాత మరో కొత్త బ్రాండ్ పైనా మన స్టార్లు కన్నేస్తారనడంలో సందేహమేం లేదు. ఇటీవల ఆర్.ఆర్.ఆర్ చివరి రోజు షూటింగ్ ముగించి తారక్ లంబోర్ఘిణిలో తిరుగు పయనం కాగా.. చరణ్ ఆస్టన్ మార్టిన్ రెడ్ కార్ లో రిటన్ అయ్యారు. ఇదే రెడ్ ఆస్టన్ మార్టిన్ తో శంకర్ దర్శకత్వంలోని ఆర్.సి 15 ప్రారంభోత్సవంలో సెట్స్ కి చరణ్ విచ్చేశారు.
అక్కినేని నాగార్జున- చైతూకి కార్లపై మోజు
టాలీవుడ్ లో అక్కినేని నాగార్జునకు వింటేజ్ కార్లను సేకరించే హ్యాబిట్ ఉందని విన్నాం. నాగచైతన్య కు షోరూమ్ కి వచ్చిన ప్రతి కార్ ని రైడ్ చేయాలన్న పంతం ఉంది. అతడు స్పోర్ట్స్ మోటార్ బైక్ లను నడుపుతారు. సాయి తేజ్ .. నవీన్ విజయ్ కృష్ణ.. సుధీర్ బాబు లాంటి యువహీరోలకు స్పోర్ట్స్ కార్ లు బైక్ లు అంటే ఫ్యాషన్ ఉంది. ఇంకా టాలీవుడ్ లో చాలామంది హీరోలు స్పోర్ట్స్ బైక్ లు కార్లను అమితంగా ఇష్టపడతారు.