రామ్ గోపాల్ వ‌ర్మ‌కు దారుణ అవ‌మానం

Update: 2022-05-06 07:30 GMT
వివాదాల‌నే త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటూ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా సంచ‌ల‌నాలు సృష్టిస్తుంటారు ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. 'శివ‌' చిత్రంతో తెలుగు సినిమాల్లో స‌రికొత్త ట్రెండ్ సెట్ చేసిన ఆయ‌నకు దారుణంగా అవ‌మానం జ‌రిగింది. ఆయ‌న తెర‌కెక్కించిన తాజాగా మూవీ 'మా ఇష్టం' . ఇద్ద‌రు లేడీ లెస్బియ‌న్ ల క‌థ‌తో ఈ సినిమాని ఆయ‌న రూపొందించారు. వివాదాస్ప‌ద క‌థాంశం కావ‌డంతో దీని చుట్టూ వివాదాలు మొద‌ల‌య్యాయి. ఏకంగా పీవీఆర్ సినిమాస్ గ్రూప్ థీయేట‌ర్స్ వ‌ర్మ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించ‌లేమంటూ బ‌హిష్క‌రించాయి.

దీంతో వ‌ర్మ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ఇది అన్యాయ‌మ‌ని, ఈ విష‌యంలో నేను కోర్టుని ఆశ్ర‌యిస్తాన‌ని హెచ్చ‌రించారు. అర‌చేతిని అడ్డుపెట్టి సూర్య‌కాంటిని ఆప‌లేర‌ని, అలాగే త‌న సినిమాకు అడ్డంకులు సృష్టించి రిలీజ్ ని ఆప‌లేరంటూ ఘాటుగా స్పందించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా దీనిపై ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు అయినా ఫ‌లితం శూన్యం. అంతే కాకుండా వ‌ర్మ ఈ మ‌ధ్య నాకు న‌చ్చిన‌ట్టే తీస్తాన‌ని, చూస్తే చూడండి లేదంటే మీ ఖ‌ర్మ అని బాహాటంగానే అన‌డం, పైగా వ‌ర్మ సినిమాల్లో కంటెంట్ బూత‌ద్దం పెట్టి చూద్దామ‌న్నా క‌నిపించ‌క‌పోవ‌డంతో ప్రేక్ష‌కులు ఆస‌క్తిని చూపించ‌డం లేదు.

ఇదే కార‌ణాల‌తో ఆయ‌న సినిమాల‌ని రిలీజ్ చేయ‌డానికి ఏ డిస్ట్రిబ్యూట‌రూ స‌హ‌సం చేయ‌డం లేదు. దీంతో వ‌ర్మ సినిమాల‌కు రిలీజ్ క‌ష్టాలు ఎదుర‌వుతున్నాయి. ఇదిలా వుంటే ఎట్ట‌కేల‌కు వ‌ర్మ రూపొందించిన 'మా ఇష్టం' శుక్ర‌వారం విడుద‌లైంది. గ్రాండ్ రిలీజ్ అంటూ వ‌ర్మ ట్విట్ట‌ర్ లో ఈ సినిమా రిలీజ్ ప‌బ్లిసిటీ చేసుకున్నాడు. క‌ట్ చేస్తే ఈ సినిమాకు హైద‌రాబాద్ లో దొరికిన థియేట‌ర్ ఒక్క‌టే. అది కూడా రెండు ఆట‌ల ఒప్పందంతో కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ రెండు ఆట‌ల‌కు కూడా ఓ ట్విస్ట్ వుంది. మే 12న సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన 'స‌ర్కారు వారి పాట‌' రిలీజ్ కాబోతోంది. అంత వ‌ర‌కు మాత్ర‌మే వ‌ర్మ 'మా ఇష్టం' రెండు షోలు ప్ర‌ద‌ర్శ‌న‌. ఆ త‌రువాత నుంచి అది కూడా వుండ‌దు.

మెయిన్ సిటీలోనే ఇలా వుంటే ఇత‌ర సిటీల‌ల్లో వ‌ర్మ సినిమా ప‌రిస్థితి మ‌రీ దారుణంగా మారిందంటున్నారు. పేరు లేని డైరెక్ట‌ర్ లు తీసే సినిమాల‌కు రెండు మూడు థియేట‌ర్లు ల‌భిస్తున్న ఈ రోజుల్లో ట్రెండ్ సెట్ట‌ర్ సినిమాల‌ని తీసిన ద‌ర్శ‌కుడు వ‌ర్మ చిత్రానికి ఒక్క థియేట‌ర్ మాత్ర‌మే ల‌భించి అందులో రెండు ఆట‌ల‌కు మాత్ర‌మే ప‌ర్మీష‌న్ ల‌భించ‌డం ఆయ‌న‌కు ద‌క్కిన దారుణ అవ‌మానం కాక మ‌రేంటీ అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.

దీంతో వ‌ర్మ ప‌ని అయిపోయింద‌ని చెబుతున్నారు. ఇక‌ప్పుడు వ‌ర్మ సినిమా అంటే ఆ క్రేజే వేరు. ఆ హంగామానే వేరుగా వుండేది. తొలి రోజు సినిమా చూడాలని అభిమానులు, ప్రేక్ష‌కులు భారీ సంఖ్య‌లో థియేట‌ర్ల‌కు త‌ర‌లి వ‌చ్చేవారు. కానీ ప‌రిస్థితి మారింది. వ‌ర్మ సినిమాకు క్రేజ్ పూర్తిగా ప‌డిపోయింది. ఒక్క థియేట‌ర్ అంతులో రెండు షోలు.. అది కూడా కేవ‌లం ఆరు రోజుల‌కు ప‌డిపోవ‌డంతో వ‌ర్మ ఇక దుకాణం స‌ర్దేయాల్సిందే అంటున్నారు.
Tags:    

Similar News