టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది డబ్బింగ్ బొమ్మ మెరుపులు మెరిపించింది. ఊహించని విధంగా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టడమే కాకుండా ఓదశలో స్ట్రెయిట్ సినిమాలనే వెనక్కి నెట్టేసింది. స్టార్ హీరోలు, సీనియర్ స్టార్స్ నటించిన సినిమాలు కూడా డబ్బింగ్ సినిమాల ధాటికి సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో యష్ నటించిన 'కేజీఎఫ్ చాప్టార్ 2' వంటి సంచలన సినిమాతో డబ్బింగ్ సినిమాల ప్రభంజనం మొదలైంది.
దీంతో డబ్బింగ్ ల ప్రారంభం ఊహకందని విధంగా అదిరిపోయింది. చాలా వరకు డబ్బింగ్ సినిమాలు ఈ ఏడాది పాన్ ఇండియా మూవీస్ గా సంచలనాలు సృష్టించాయి. బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలని మించి వసూళ్లని రాబట్టాయి. 'కేజీఎఫ్ చాప్టర్ 2' తెలుగు వెర్షన్ ఉభయ తెలుగు రాష్ట్రాలతో కలిపి వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లకు మించి షేర్ ని సాధించి ఆశ్చర్యపరిచింది. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 80 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది.
'కేజీఎఫ్ చాప్టర్ 2' తరువాత ఆ రేంజ్ లో కాకపోయినా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 'కాంతార' సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. అన్ని భాషల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 450 కోట్లు వసూళ్లని రాబట్టిన ఈ మూవీ తెలుగు వెర్షన్ రూ. 65 కోట్ల వరకు రాబట్టడం గమనార్హం. వీటి తరువాత వచ్చిన 'బ్రహ్మాస్త్ర', లవ్ టుడే భారీ స్థాయిలో వసూళ్లని రాబట్టి సత్తాని చాటాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు సినిమాలు భారీ వసూళ్లనే రాబట్టడం విశేషం.
ఈ ఏడాది 'కేజీఎఫ్ 2'తో మొదలైర డబ్బింగ్ ల ప్రభంజనం ఏడాది చవరికి వచ్చేసే సరికి చతికిల పడిపోయి ట్రాజెడిక్ ఎండింగ్ ని అందించింది. డిసెంబర్ ఎండింగ్ లో విడుదలైన డబ్బింగ్ సినిమాలు కేజీఎఫ్ 2, బ్రహ్మాస్త్ర, కాంతార, లవ్ టుడే స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఘోర పరాజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇయర్ ఎండింగ్ లో నయనతార 'కనెక్ట్' అంటూ హారర్ థ్రిల్లర్ తో రాగా.., విశాల్ 'లాఠీ' అంటూ యాక్షన్ థ్రిల్లర్ తో వచ్చాడు.
ఈ రెండు సినిమాలు ఏ విషయంలోనూ సత్తాని చాటలేకపోయాయి. తెలుగు సినిమాలు ధమాకా, 18 పేజెస్' కి ఒక్క రోజు ముందు భారీ స్థాయిలో విడుదలైనా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఈ రెండు సినిమాలు లేకపోవడంతో ప్రేక్షకులు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే తిరస్కరించడం మొదలు పెట్టారు.
దీంతో ఈ రెండు సినిమాలు భారీ డిజాస్టర్ లుగా మారి డబ్బింగ్ లకు ట్రాజెడిక్ ఎండింగ్ ని అందించాయి. ఇదే సమయంలో విడుదలైన ధమాకా, 18 పేజెస్ సినిమాలు యావరేజ్ టాక్ నే దక్కించుకున్నా వసూళ్ల పరంగా మాత్రం భారీ స్థాయిలో పుంజుకోవడం విశేషం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.