ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్. క్లైమాక్స్ చిత్రీకరణతో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. నభూతోనభవిష్యతి అన్న చందంగా తెలుగు సినీఇండస్ట్రీతో పాటు అన్ని ఇండస్ట్రీల్లోనూ మార్మోగేలా గూస్ బంప్స్ తో ఈ దృశ్యాల్ని చిత్రీకరిస్తున్నారు.
ఆసక్తికరంగా ఈ క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ప్రేక్షకుల్ని కుర్చీ అంచుపైకి తెస్తుందట. ఎగ్జయిట్ అయ్యి కళ్లప్పగించి చూస్తారని లీకులు అందాయి. సీతారామరాజు (చరణ్).. కొమరం భీమ్ (తారక్) తెల్లదొరలు మల్ల యోధులపై భీకరంగా విరుచుకుపడతారు. ఆ క్రమంలోనే ఒకరికి కళ్లు పోతాయి. అంధకారం అవుతుంది. ఇంకొకరికి కాళ్లు పోతాయి. నడవలేరు. అయినా ప్రత్యర్థిని గెలవాలి.
దానికోసం కళ్లు పోయిన వారి సాయం కాళ్లు లేని వారికి.. కాళ్లు లేని వారి సాయం కళ్లు పోయిన వారికి...! ఎలా కుదిరింది అన్నది ఆద్యంతం రక్తి కట్టించేలా ఎంతో కన్విన్సింగ్ గా తెరపై ఆవిష్కరిస్తున్నారట. ఇది సినిమాకే హైలైట్స్ లో ఒకటిగా ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి సీన్లలోనే స్క్రీన్ ప్లే పీక్స్ లో ఉంటుందని దీనికోసం విజయేంద్రుడు- రామౌళి బృందం గట్టిగానే ప్లాన్ చేశారని అర్థమవుతోంది. ఆసక్తికరంగా అలాంటి కాంప్లికేటెడ్ సీన్ రాసినా కానీ.. దానిని ప్రజలకు ఎంతో కన్విన్సింగ్ గా చూపించేందుకు చాలా సమయం తీసుకుంటున్నారట. రోజుకు ఒకట్రెండు షాట్లు మాత్రమే తెరకెక్కిస్తున్నారని తెలిసింది. అక్టోబర్ లో ఈ భారీ పాన్ ఇండియా చిత్రం రిలీజ్ కానున్న సంగతి తెలిసినదే.