ఏమైపోయాడు ఆది?

Update: 2018-08-05 13:30 GMT
డైలాగ్ కింగ్ సాయి కుమార్ వారసుడిగా పరిశ్రమలో అడుగు పెట్టిన ఆది మొదటి సినిమా ప్రేమ కావాలి పరవాలేదు అనిపించడమే కాక ఓ మోస్తరు ప్రశంశలు అవార్డులు కూడా తీసుకువచ్చింది. తర్వాత లవ్లీ జస్ట్ ఓకే అనిపించగా మూడో సినిమా సుకుమారుడు నుంచి దెబ్బల మోత మొదలైంది. అది మొదలు ఆదికి  బ్రేక్ సంగతి దేవుడెరుగు కనీసం ఈ హీరో ఉన్నాడు అని చెప్పుకునే రేంజ్ లో కూడా ఒక్క సినిమా ఆడలేదు. శమంతకమణి పాస్ అయ్యింది కానీ తనతో పాటు మరో ముగ్గురు హీరోలు ఉండటంతో పేరు మొత్తం దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తీసేసుకున్నాడు.

ఇక గత ఏడాది చేసిన ఒకే ఒక్క సినిమా నెక్స్ట్ నువ్వే ఆది కెరీర్ కి ఫేర్ వెల్ పార్టీ లాగా అనిపించింది. సరే శాండల్ వుడ్ లో ట్రై చేద్దామన్నా కుదరలేదు. మొత్తానికి ఆది పేరు ఎక్కడా వినిపించకపోగా ఆ ప్లేస్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరస సక్సెస్ లు అందుకుని మళ్ళి హీరోగా ట్రై చేస్తున్న ఆది పినిశెట్టి లైన్ లోకి వచ్చేసాడు. ఇప్పుడు ఆది పేరుకు సాయి కుమార్ అని తగిలిస్తే తప్ప గుర్తుపట్టలేని పరిస్థితి.

అలా అని ఆది చేతిలో సినిమా లేదని కాదు. రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మారి తీస్తున్న డెబ్యూ మూవీలో ఆదినే హీరో. ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టారు. బుర్రకథ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. హీరో దర్శకుడి కాంబో ప్రకారం చూసుకున్నా ఇదేమి క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్ కాదు. రత్నబాబు ఖాతాలో రచయితగా కొన్ని కామెడీ సినిమాలు ఉన్నాయి కానీ అందరికి తెలిసిన ఓ రేంజ్ రైటర్ కాకపోవడం హైప్ పరంగా కొంత మైనస్ కావచ్చు. కంటెంట్ ఉంటే ప్రమోషన్ తో ప్రేక్షకులను రప్పించవచ్చు కానీ అప్పటి దాకా దీని ప్రోగ్రెస్ తెలుసుకునేందుకు ఆదికి ప్రత్యేకంగా అభిమానులు కూడా లేరు. ఈ నేపథ్యంలో ఆది సాయి కుమార్ కెరీర్ స్పీడందుకోవాలి అంటే ఏదో ఒక మేజిక్ జరగాలి.

మరోపక్క సందీప్ కిషన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నక్షత్రం-మనసుకు నచ్చింది దారుణంగా దెబ్బ తినడం అంతంత మాత్రంగా ఉన్న కుర్రాడి మార్కెట్ ని బాగా డ్యామేజ్ చేసింది. ఏదో కొత్త సినిమా కోసం గెడ్డం పెంచుతున్నాడు అని వార్తలు వచ్చాయి అబ్బాయి బయట మాత్రం కనిపించడం  మానేసాడు. ఆది లాగా ఏదో ఒక ఆఫర్ రాకపోదు కానీ సాలిడ్ హిట్ పడితే తప్ప కోలుకోవడం కష్టం.
Tags:    

Similar News