ప్రముఖ దర్శకుడు రవి రాజా పినిశెట్టి తనయుడిగా 'ఒక విచిత్రం’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు ఆది పినిశెట్టి. ఆ తర్వాత తమిళంలో కొన్ని సినిమాల్లో నటించి అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ మూవీలో విలన్ గా టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాలో కూడా ప్రతినాయకుడిగా నటించాడు. నానితో కలిసి ‘నిన్నుకోరి’ సినిమాలో కనిపించాడు. సోదరుడి దర్శకత్వంలో 'మలుపు' సినిమాలలో నటించి సక్సెస్ అందుకున్నాడు. 'నీవెవరో' 'యూ టర్న్' సినిమాలతో పలకరించిన ఆది పిన్నిశెట్టి.. రామ్ చరణ్ 'రంగస్థలం' మూవీలో కీలక పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో కమ్ విలన్ గా ఆది పినిశెట్టి నిలదొక్కుకున్నాడు అనుకుంటున్న తరుణంలో తెలుగులో మరో సినిమా రిలీజ్ చేయలేకపోయాడు.
నిజానికి ఆది పిన్నిశెట్టి - సమంత కాంబోలో ఓ సినిమా చేయాల్సి ఉండగా.. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కి బ్రేక్ పడిందనే టాక్ నడుస్తోంది. ఇక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో 'క్లాప్' అనే మరో ద్విభాషా సినిమా స్టార్ట్ చేసాడు. పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామాంజనేయులు జవ్వాజి - ఎం. రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కోవిడ్ నేపథ్యంలో నిలిచిపోయిన 'క్లాప్' షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభించారు. అలానే కీర్తి సురేష్ తో కలిసి ఆది నటించిన 'గుడ్ లక్ సఖీ' సినిమా విడుదలపై ఇంకా క్లారిటీ లేదు. మొత్తం మీద ఆది పిన్నిశెట్టి తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి చాలా సమయమే పట్టేలా ఉంది.