అవడానికి తెలుగు వాడే అయినా ఆది పినిశెట్టి ముందు కోలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడ పేరు రావడంతో టాలీవుడ్ లోనూ ఆది పినిశెట్టికి ఆఫర్లు వచ్చాయి. ముందు ఒకటి రెండు సినిమాలు చేసినా పెద్దగా బ్రేక్ రాలేదు. అల్లు అర్జున్ మూవీ సరైనోడులో విలన్ పాత్ర టర్నింగ్ పాయింట్ అయింది. రీసెంట్ గా రామ్ చరణ్ మూవీ రంగస్థలంలో కుమార్ బాబు పాత్రలో అతడి నటన అందరి ప్రశంసలూ అందుకుంది.
రంగస్థలం తరవాత ఆది పినిశెట్టి హీరోగా తెలుగులో ఓ సినిమాలో నటించాడు. ఈ మూవీ గురించి ప్రొడ్యూసర్ డైరెక్టర్లు చాలా లో ప్రొఫయిల్ మెయిన్ టెయిన్ చేశారు. ఎప్పుడు తీశారు.. ఎక్కడ తీశారు.. ఎప్పుడు మొదలెట్టారు ఇలాంటి వివరాలేవీ బయట పెట్టకుండా దాదాపుగా షూటింగ్ కంప్లీట్ స్టేజ్ దాకా తెచ్చేశారు. థ్రిల్లర్ బ్యాక్ గ్రౌండ్ తో వస్తున్న ఈ సినిమాను ఎం.వి.వి.సత్యనారాయణ - కోన వెంకట్ కలిసి నిర్మించారు. వీళ్లిద్దరరి కాంబినేషన్ లో ఇంతకుముందు గీతాంజలి సినిమా వచ్చింది.
ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకుని బాలీవుడ్ కు మకాం మార్చిన తాప్పీ పన్ను హీరోయిన్ గా నటించింది. ఆమధ్య ఆనందోబ్రహ్మ సినిమాలో కనిపించిన తాప్సీ మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు ప్రేక్షకులను పలకరింనుంది. ఆది పినిశెట్టి - తాప్సీ కెరీర్ మొదట్లో గుండెల్లో గోదారి సినిమాలో కలిసి నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు వీళ్లిద్దరు కలిసి వెండితెరపై కనిపించబోతున్నారు. ఈ మూవీకి నువ్వెవరు టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది.